Lok Sabha | 18వ లోక్‌సభ (18th Lok Sabha) తొలి సమావేశాలు కొత్త పార్లమెంట్ భవనంలో విపక్షాల ఆందోళనల నడుమ కొనసాగుతున్నాయి. ఈ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమైన విషయం తెలిసిందే. తొలిరోజు 280 మంది ఎంపీలు లోక్‌సభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎంపీలతో ప్రొటెం స్పీకర్ బర్తృహరి మహతాబ్ ప్రమాణం చేయించారు. రెండోరోజైన మంగళవారం కూడా మిగిలిన ఎంపీలు ప్రమాణం చేస్తున్నారు. అయితే, ఈ సమావేశాల్లో విపక్ష ఇండియా కూటమి ఎంపీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రొటెం స్పీకర్ నియమించిన తీరుకు వ్యతిరేకంగా సమావేశాలు ప్రారంభం నుంచి విపక్ష కూటమి పార్టీల ఎంపీలంతా రాజ్యాంగ ప్రతుల (Constitution Copy)తో సభలో నిరసన తెలుపుతున్నారు. అదేవిధంగా రాజ్యాంగ ప్రతులతోనే ప్రమాణ స్వీకారం కూడా చేస్తున్నారు. పోడియం వద్దకు వెళ్లి ముందుగా తమ చేతిలో ఉన్న రాజ్యాంగ ప్రతిని చూపించిన తర్వాతే ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సహా కూటమి పార్టీల ఎంపీలంతా ఇదే విధానాన్ని ఫాలో అవుతున్నారు.
#WATCH | Congress MP Rahul Gandhi takes oath as a member of the 18th Lok Sabha. pic.twitter.com/2UjQqn7CYd
— ANI (@ANI) June 25, 2024
చరిత్రలో తొలిసారి స్పీకర్ పదవికి ఎన్నిక
ఇదిలా ఉండగా.. దేశ చరిత్రలోనే తొలిసారి లోక్‌సభ స్పీకర్ పదవికి ఎన్నికలు జరగనున్నాయి. ఎప్పటిలాగే స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం చేసేందుకు ఎన్డీయే ప్రయత్నించింది. మంగళవారం ఉదయం స్పీకర్ ఎన్నికకు సహరించాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇండియా కూటమి నేతలను కోరారు. అయితే, స్పీకర్ ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ ఓ మెలిక పెట్టింది. డిప్యూటీ స్పీకర్ విపక్షాలకు ఇస్తే స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు సహకరిస్తామని రాహుల్ గాంధీ తెలిపారు. దీంతో డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చేందుకు ఎన్డీయే కూటమి దాదాపు అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఇండియా కూటమి సభ్యులతో రాజ్‌నాథ్ సింగ్ జరిపిన చర్చల్లో ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో ప్రతిపక్ష ఇండియా కూటమి కూడా స్పీకర్ పదవికి పోటీకి దిగింది. కాంగ్రెస్ ఎంపీ సురేశ్‌ను బరిలోకి దింపింది. ఎన్డీయే తరఫున లోక్‌సభ స్పీకర్ పదవికి ఓం బిర్లా (Om Birla) , విపక్ష ఇండియా కూటమి తరఫున కాంగ్రెస్ ఎంపీ కె.సురేశ్ (MP Suresh) నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఇప్పటి వరకూ ఏకగ్రీవమైన స్పీకర్ పదవి.. ఇప్పుడు తొలిసారి ఆ పదవికి ఎన్నికలు జరగనున్నాయి.
#WATCH | Samajwadi Party Chief and MP Akhilesh Yadav takes oath as a member of the 18th Lok Sabha. pic.twitter.com/xXW1HyMEgd
— ANI (@ANI) June 25, 2024
Also Read..
Krishnagiri MP | లోక్‌సభ సభ్యుడిగా తెలుగులో ప్రమాణం చేసిన తమిళనాడు ఎంపీ
Nandini Milk | కర్ణాటకలో నందిని పాల ధరలు పెంపు.. ప్రతి ప్యాక్‌లో 50 ml పాలు అదనం
Lok Sabha Speaker | స్పీకర్ ఎన్నికలో ట్విస్ట్.. పోటీలో విపక్ష కూటమి.. తొలిసారి ఎన్నికలు