Krishnagiri MP | 18వ లోక్‌సభ (Lok Sabha) సమావేశాలు వరుసగా రెండో రోజూ కొనసాగుతున్నాయి. ఎంపీలతో ప్రొటెం స్పీకర్ బర్తృహరి మహతాబ్ ప్రమాణం చేయిస్తున్నారు. పలువురు ఎంపీలు తమ తమ మాతృభాషల్లో ప్రమాణం చేస్తున్నారు. అయితే, తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఓ ఎంపీ మాత్రం తన మాతృభాష తమిళ్లో కాకుండా తెలుగులో ప్రమాణం (takes oath in Telugu) చేసి ఆశ్చర్యపరిచారు.
తమిళనాడులోని కృష్ణగిరి లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలుపొందిన కాంగ్రెస్ ఎంపీ (Krishnagiri MP) కె. గోపినాథ్ (K Gopinath).. ఇవాళ లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా రాజ్యాంగ ప్రతిని ఓ చేత్తో పట్టుకుని తెలుగులో ప్రమాణం చేసి ఆశ్చర్యపరిచారు. అయితే, చివర్లో మాత్రం ‘జై తమిళనాడు’ (Jai Tamil Nadu) అంటూ నినదించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. కృష్ణగిరి జిల్లా తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కలుపుతుంది. ముఖ్యంగా ఈ జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సమీపంలో ఉంటుంది. ఈ జిల్లా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు దగ్గరగా ఉన్నందున ఇక్కడి ప్రజలు తమిళంతోపాటు తెలుగు, కన్నడ భాషలు కూడా మాట్లాడతారు.
கிருஷ்ணகிரி தொகுதி கர்நாடக மாநிலத்தில் இருக்கிறதோ என்ற கேள்வி வருகிறது! #Krishnagiri pic.twitter.com/DMz9SGuMyz
— M.Vinoth 🇮🇳 2026 BJP4TamilNadu (@MVinothOffl) June 25, 2024
Also Read..
Nandini Milk | కర్ణాటకలో నందిని పాల ధరలు పెంపు.. ప్రతి ప్యాక్‌లో 50 ml పాలు అదనం
Air India flight | లండన్ వెళ్లే ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపులు.. కేరళ వ్యక్తి అరెస్ట్
Lok Sabha Speaker | స్పీకర్ ఎన్నికలో ట్విస్ట్.. పోటీలో విపక్ష కూటమి.. తొలిసారి ఎన్నికలు