న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని విపక్ష పార్టీలు శుక్రవారం రాజ్యసభలో నోటీస్ అందజేశాయి. ఈ నోటీస్‌పై 27 మంది కాంగ్రెస్ ఎంపీలు సహా 73 మంది ఎంపీలు సంతకం చేశారు.
తన పక్షపాత ధోరణిని సీఈసీ ఇంకా కొనసాగిస్తున్నందున ఆయనను అభిశంసించాలని విపక్షాలు నిర్ణయించాయని ఒక నేత తెలిపారు. అత్యంత వివరంగా నమోదు చేసిన, తిరస్కరించడానికో, కప్పిపుచ్చడానికో వీలులేని విధంగా సీఈసీపై తొమ్మిది నిర్దిష్ట ఆరోపణలతో ఈ నోటీస్ అందజేసినట్టు కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ తెలిపారు. అయితే ఆ ఆరోపణలు ఏమిటో ఆయన వివరించ లేదు.