న్యూఢిల్లీ : బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై పార్లమెంట్ వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ రమేష్ బిధూరికి కాషాయ పార్టీ కీలక ఎన్నికల బాధ్యతలు (BJP Rewards Hate) అప్పగించడం పట్ల విపక్షం అభ్యంతరం వ్యక్తం చేసింది. రాజస్ధాన్‌లోని టోంక్ నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జ్గా రమేష్ బిధూరిని నియమించడం పట్ల కాషాయ పార్టీపై విమర్శలు వెల్లువెత్తాయి.
విద్వేష వ్యాఖ్యలు చేసే వారికి బీజేపీ పట్టం కడుతుందని రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ అన్నారు. రమేష్ బిధూరి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో డానిష్ అలీని ఉద్దేశించి ఎవరూ మాట్లాడలేని పదజాలం ఉపయోగించారని పేర్కొన్నారు. ఇప్పుడు అదే వ్యక్తిని టోంక్ జిల్లా బీజేపీ ఇన్చార్జ్గా కాషాయ పార్టీ నియమించిందని గుర్తుచేశారు. టోంక్‌లో ముస్లిం జనాభా 29 శాతమని, రాజకీయ లబ్ధి కోసం విద్వేష విషం వెదజల్లుతున్నారని అన్నారు.
ఇక కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ కూడా ఈ అంశంపై స్పందించారు. సబ్ కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ ఇప్పడు సబ్ హై ఇంకా బక్వాస్ అంటూ ట్వీట్ చేశారు. ముస్లిం ఎంపీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బిధూరిని బీజేపీ ప్రమోట్ చేస్తోందని టీఎంసీ ఎంపీ మహువ మొయిత్ర వ్యాఖ్యానించారు. షోకాజ్ నోటీసులు జారీ చేసిన వ్యక్తికి ఆ పార్టీ నూతన బాధ్యతలు ఎలా అప్పగిస్తుందని ప్రశ్నించారు.
Read More :
Ganesh Shobhayatra | ట్యాంక్‌బండ్ వైపు వడివడిగా కదులుతున్న గణనాథులు