న్యూఢిల్లీ : మణిపూర్ హింసాకాండ (Manipur Violence) నేపధ్యంలో ఇటీవల ఆ రాష్ట్రంలో క్షేత్రస్ధాయి పరిశీలనకు వెళ్లిన విపక్ష ఎంపీలు సోమవారం విపక్ష కూటమి ఇండియా పార్లమెంటరీ పార్టీ నేతలకు అక్కడి పరిస్ధితిని వివరించారు. రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే సహా పలువురు విపక్ష నేతలతో భేటీ అయిన ప్రతినిధి బృందం సభ్యులు మణిపూర్లో తాజా పరిస్ధితిని నివేదించారు. పార్లమెంట్ భవనంలో జరిగిన ఈ సమావేశానికి కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా హాజరయ్యారు.
రెండు రోజుల పాటు మణిపూర్లో పర్యటించిన 21 మంది సభ్యులతో కూడిన విపక్ష ఎంపీల బృందం ఆదివారం మధ్యాహ్నం తిరిగి ఢిల్లీకి చేరుకుంది. ఇక అంతకుముందు మణిపూర్లో శాంతి నెలకొనేందుకు కుకీ, మైతీ తెగల ప్రజలు సహకరించాలని కోరుతూ శాంతికి మరో ప్రత్యామ్నాయం లేదని మణిపూర్ పర్యటన ముగించుకుని వచ్చిన అనంతరం ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా అన్నారు. మణిపూర్లో శాంతి పునరుద్ధరించాలని తాము కోరుతున్నామని, న్యాయంతో పాటు శాంతి స్ధాపనే తమ డిమాండ్ అని పేర్కన్నారు.
రెండు తెగల ప్రజలు సామరస్యంతో నివసించాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు. మణిపూర్లో పరిస్ధితి ప్రమాదకరంగా ఉందని, మధ్యప్రదేశ్ లేదా మణిపూర్ ప్రాంతం ఏదైనా శాంతికి ప్రత్యామ్నాయం లేదని గుర్తెరగాలని మనోజ్ ఝా స్పష్టం చేశారు. 21 మంది విపక్ష నేతలతో కూడిన ప్రతినిధి బృందం రెండు రోజుల పాటు మణిపూర్లో పర్యటించి క్షేత్రస్ధాయి పరిస్ధితులతో కూడిన వివరాలతో గవర్నర్కు వినతిపత్రం సమర్పించిన అనంతరం విపక్ష బృందం తిరిగి ఢిల్లీకి చేరుకుంది.
Read More :
Man jumps into sea | వంతెనపై కారు ఆపి.. సముద్రంలోకి దూకిన వ్యక్తి