న్యూఢిల్లీ: పెగాసస్ స్పై వేర్, వివాదాస్పద వ్యవసాయ చట్టాలు, ద్రవ్యోల్బణం అంశాలపై పార్లమెంటులో చర్చించాలన్న విపక్షాల ( Opposition leaders ) డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెడుతూ వస్తున్నది. దాంతో వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి పార్లమెంట్ ఉభయసభల్లో వాయిదాల పర్వం కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో ఇవాళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ అధ్యక్షతన విపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి.
కాంగ్రెస్ నేతలు రాహుల్‌గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, అంబికాసోనీ, గౌరవ్ గొగోయ్, శివసేన ఎంపీ సంజయ్ రౌత్, ఆర్జేడీ నేత మనోజ్ ఝా, డీఎంకే నేత టీ శివ తదితరులు పార్లమెంటు ఆవరణలో సమావేశమై.. కేంద్రంతో ఉమ్మడి పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వివిధ అంశాలపై కేంద్ర ప్రభుత్వం మెడలు వంచేవరకు ఉమ్మడి పోరాటం ఆపకూడదని డిసైడయ్యారు. అనంతరం విపక్ష నేతలంతా బస్సులో జంతర్‌మంతర్‌కు వెళ్లారు.
అక్కడ వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులతో విపక్ష పార్టీల నేతలు కలిసిపోయారు. రైతులకు మద్దతుగా వారు కూడా ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా, పెగాసస్‌కు వ్యతిరేకంగా విపక్ష నేతలు నినాదాలు చేశారు.
#WATCH | Congress leader Rahul Gandhi and other Opposition leaders reach Jantar Mantar, Delhi to extend support to farmers in their protest against farm laws by raising slogans with a placard 'Save Farmers, Save India' pic.twitter.com/VMyi4ShlYo
— ANI (@ANI) August 6, 2021