CAA Notification : రానున్న లోక్సభ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసమే కేంద్ర ప్రభుత్వం సీఏఏ అమలు కోసం నోటిఫికేషన్ జారీ చేసిందని విపక్షాలు భగ్గుమన్నాయి. ఎన్నికలకు ముందు పౌరసత్వ సవరణ చట్ట నిబంధనలను కేంద్రం నోటిఫై చేయడం మతప్రాతిపదికన ఓటర్లను విభజించేందుకేనని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, అసోంలో ప్రజల మధ్య విభజన చిచ్చు రాజేసేందుకేనని అన్నారు.
లోక్సభ ఎన్నికలకు తేదీలు ప్రకటించేందుకు కొన్ని రోజుల ముందు సీఏఏ అమలు కేవలం రాజకీయ కారణాలతోనే చేపట్టారని పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు డ్రామా చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ చట్టం 2020లో ఆమోదించినా పలు వాయిదాల అనంతరం కేవలం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే రెండు, మూడు రోజుల ముందు అమలుకు పూనుకోవడం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమేనని దీదీ వ్యాఖ్యానించారు.
ఈ నోటిఫికేషన్లో నిబంధనలను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన అనంతరం రేపటి హౌరా సమావేశంలో వాటిపై మాట్లాడతానని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. మతం, కులం, భాషం ఆధారంగా ఎలాంటి వివక్ష చూపినా తాము ఆమోదించబోమని ఆమె తేల్చిచెప్పారు.
Read More :