న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం గురువారం అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పా టు చేసింది. ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీరులలో భారత దళాలు నిర్వహించిన దాడుల గురించి నేతలకు తెలియజేయనుంది.
ఈ భేటీ గురించి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఎక్స్ పోస్ట్‌లో తెలిపారు. పార్లమెంటు గ్రంథాలయ భవనంలో గురువారం ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరుగుతుందని చెప్పారు. పాకిస్థాన్‌తోపాటు, పీవోకేలో ఉన్న ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసేందుకు బాధ్యతాయుతంగా దాడులు నిర్వహించినట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది.