Rajnath Singh | హనుమాన్ లంకా దహనం చేసినట్లే.. మన సైన్యం ఉగ్రవాదులపై దాడి చేసిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్‌తో పాకిస్తాన్‌కు గట్టి సమాధానం ఇచ్చామని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. పాక్‌లోని ఉగ్రదాడుల శిబిరాలపై భారత్ బుధవారం వేకువ జామున దాడి చేసిన విషయం తెలిసిందే. ఆరు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 50 బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ప్రారంభోత్సవం సందర్భంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన సైనికులు రాత్రి అద్భుత పరాక్రమం ప్రదర్శించారన్నారు. మన సైనికులు రాత్రి ఒక చరిత్ర సృష్టించారన్నారు. సాధారణ పౌరులకు ఎలాంటి సిబ్బంది లేకుండా దాడులు చేశారన్నారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా పాక్తిసన్కు గట్టి సమాధానం ఇచ్చామన్నారు.
ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసి సత్తాచాటారన్నారు. పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై సాహసోపేతమైన దాడి చేశారని.. సాధారణ పౌరులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దాడులు చేశామన్నారు. ధైర్య సాహసాలు ప్రదర్శించిన సైనికులకు అభినందనలు తెలిపారు. సరిహద్దుల్లో పూర్తి అప్రమత్తంగా ఉన్నామని.. సైనికులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి రాజ్‌నాథ్ సింగ్ ధన్యవాదాలు చెప్పారు. పహల్గాంలో అమాయకులను లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరిపారని ఆరోపించారు. పహల్గాంలో అమాయక పౌరులను చంపిన వారినే మట్టుబెట్టినట్లు పేర్కొన్నారు. శత్రువకు సరైన బుద్ధి చెబుతామన్నారు. దేశభద్రకు భంగం కలిగించే చర్యలను సహించమన్నారు. ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా దాడులు చేశామన్నారు. లంకా దహనం చేసిన హనుమంతుడే మాకు ఆదర్శమని.. హనుమాన్ లంకా దహనం చేసినట్లే మన సైన్యం ఉగ్రవాదులపై దాడి చేసిందని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. భారత్ లక్ష్యం పాకిస్తాన్ కాదని.. ఉగ్రవాదులేనన్నారు.