శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లోని సుంజ్వాన్ ఏరియాలో ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు భద్రతా బలగాలకు సమాచారం అందింది. స్థానికంగా ఉన్న ఓ ఇంట్లో ఉగ్రవాదులు ఉన్నట్లు సైన్యం గుర్తించింది. ఉగ్రవాదుల కోసం గురువారం రాత్రి అక్కడ బలగాలు కూంబింగ్ ప్రారంభించాయి. ఈ క్రమంలో భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో ఓ జవాను ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు జవాన్లు తీవ్రంగా గాయపడినట్లు జమ్మూ జోన్ ఏడీజీపీ ముఖేష్ సింగ్ పేర్కొన్నారు. ఉగ్రవాదుల కోసం కూంబింగ్ కొనసాగుతోందని సింగ్ తెలిపారు.
Jammu & Kashmir | One security force jawan martyred and 4 jawans injured in the encounter in Sunjwan area of Jammu.
Visuals of security forces’ deployment deferred by unspecified time pic.twitter.com/JEffOONN11
— ANI (@ANI) April 22, 2022