Woman Steals Jewellery | బంగారు ఆభరణాలు దొంగిలించిన మహిళ.. ఇంటి యజమాని నిలదీయగా బట్టలు విప్పుతానని బెదిరింపు
Woman Steals Jewellery | ఒక ఇంటిలోని బంగారు ఆభరణాలను ఒక మహిళ దొంగిలించింది. సీసీటీవీ ఏర్పాటు చేసుకున్న ఇంటి యజమాని మొబైల్ ఫోన్ ద్వారా ఇది చూశాడు. ఇంటికి తిరిగి వచ్చి ఆ మహిళను నిలువరించగా బట్టలు విప్పుకుంటానని ఆమె బెదిరించింది.
జైపూర్: ఒక ఇంటిలోని బంగారు ఆభరణాలను ఒక మహిళ దొంగిలించింది. సీసీటీవీ ఏర్పాటు చేసుకున్న ఇంటి యజమాని మొబైల్ ఫోన్ ద్వారా ఇది చూశాడు. ఇంటికి తిరిగి వచ్చి ఆ మహిళను నిలువరించగా బట్టలు విప్పుకుంటానని ఆమె బెదిరించింది. (Woman Steals Jewellery) రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఈ సంఘటన జరిగింది. జైపూర్‌లోని ముహానా ప్రాంతంలో నివసిస్తున్న ఒక వ్యక్తి ఇంట్లో కొన్ని రోజుల కిందట నగలు, డబ్బు చోరీ అయ్యాయి. దీంతో భద్రత, నిఘా కోసం తన ఇంట్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశాడు.
కాగా, గురువారం ఆ వ్యక్తి తన కుటుంబంతో కలిసి బయటకు వెళ్లాడు. అతడు తన మొబైల్ ఫోన్లో సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించాడు. ఆ వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించిన ఒక మహిళ బెడ్రూమ్లోకి వెళ్లి బీరువా తెరిచింది. ఆభరణాల పెట్టె తీసి బెడ్‌పై ఉంచి వాటిని పరిశీలించింది. కొన్ని నగలు చోరీ చేసింది.
మరోవైపు ఆ వ్యక్తి ఇది చూసి షాక్ అయ్యాడు. వెంటనే తన పొరుగున నివసించే వ్యక్తికి ఫోన్ చేసి ఈ విషయం చెప్పాడు. మెయిన్ గేట్‌కు తాళం వేయమని సూచించాడు. హుటాహుటిన ఇంటికి తిరిగి వచ్చాడు. గేట్ లాక్ వేయడంతో ఇంట్లో చిక్కుకున్న ఆ మహిళను ఇంటి యజమాని, పొరుగు వ్యక్తి కలిసి నిలదీశారు. ఈ సందర్భంగా తన బట్టలు చించుకుని విప్పుకుంటానని, వారిపై పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేస్తానని ఆమె బెదిరించింది.
అయితే ఆ వ్యక్తి దీనిని వీడియో రికార్డ్ చేశాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకున్నారు. ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఇంటి యజమాని ఫిర్యాదుతో ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- CCTV
- House Owner
- Jaipur
- jewellery
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

