Omar Abdullah : సరిహుద్దుల వెంబడి కాల్పుల విరమణ(Ceasefire) ఒప్పందాన్ని పాకిస్థాన్ ఉల్లంఘించింది. ఇరుదేశాలు సీస్‌ఫైర్‌కు ఓకే చెప్పిన మూడు గంటల్లోనే దాయాది దేశం దాడులకు తెగబడుతోంది. జమ్మూ కశ్మీర్, సరిహద్దు నియంత్రణ రేఖ(LOC) వెంబడి డ్రోన్లతో దాడులు చేస్తోంది. దాంతో, ‘ఇదేంటీ.. అసలు ఏం జరుగుతోంది?’ అని పాక్ దుశ్చర్యల గురించి జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
కాల్పుల విరమణకు పాకిస్థాన్ తూట్లు పొడుస్తోంది. శ్రీనగర్‌లో పలు చోట్ల భారీ పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్నాయి. శత్రుదేశం దాడులతో శ్రీనగర్‌లోని రక్షణ వ్యవస్థ అప్రమత్తం అయింది అని సీఎం ఒమర్ అబ్దుల్లా తన ట్వీట్లో వెల్లడించారు.
What the hell just happened to the ceasefire? Explosions heard across Srinagar!!!
— Omar Abdullah (@OmarAbdullah) May 10, 2025
శనివారం 5 గంటల నుంచి కాల్పుల విరమణ పాటించేందుకు భారత్, పాక్‌లు అంగీకరించాయి. దాంతో, ఉద్రికత్త వాతావరణం ఉండదని అందరూ భావించారు. కానీ, అంతలోనే పాక్ సైన్యం తన వక్ర బుద్ది చూపించింది. నియంత్రణ రేఖతో పాటు సరిహద్దు గ్రామాలపై డ్రోన్లతో దాడికి దిగుతోంది. అయితే.. వెంటనే అప్రమత్తమైన భారత సైన్యం దాయాది డ్రోన్లను కూల్చేయాలని బీఎస్ఎఫ్ దళానికి ఆదేశాలు ఇచ్చింది.
This is no ceasefire. The air defence units in the middle of Srinagar just opened up. pic.twitter.com/HjRh2V3iNW
— Omar Abdullah (@OmarAbdullah) May 10, 2025