మంగళవారం 31 మార్చి 2020
National - Mar 20, 2020 , 13:52:27

తల్లి చనిపోయినా.. కరోనా విధుల్లో డాక్టర్‌

తల్లి చనిపోయినా.. కరోనా విధుల్లో డాక్టర్‌

భువనేశ్వర్‌ : కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దానిపై అవగాహన కల్పించేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విస్తృత ప్రచారం కల్పిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వ అధికారులకు, వైద్యులకు నో హాలిడేస్‌ ప్రకటించారు. వైద్యులు పూర్తిగా కరోనా విధుల్లో నిమగ్నమై పోయారు. ఒడిశాలోని సాంబల్‌పూర్‌ జిల్లాలో కరోనా విధుల్లో ఉన్న డాక్టర్‌ చిత్తశుద్ధితో పని చేశారు. 

సాంబాల్‌పూర్‌ అసిస్టెంట్‌ డివిజనల్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ అశోక్‌ దాస్‌ తల్లి పద్మిని(80) ఈ నెల 17న మృతి చెందింది. తన తల్లి చనిపోయిందని సమాచారం వచ్చిన కూడా అతను విధి నిర్వహణలోనే ఉండి.. కరోనాపై ప్రచారం చేశారు. విధులు ముగిసిన తర్వాతనే ఇంటికెళ్లి తల్లి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా డాక్టర్‌ అశోక్‌ దాస్‌ మాట్లాడుతూ.. వ్యక్తిగత సెలవు తీసుకోవడం కంటే.. ప్రజా సేవ చేయడమే ముఖ్యం అని ఆయన అన్నారు. వ్యక్తిగతంగా నష్టం కలిగినప్పటికీ, ప్రజా సేవ కోసమే తాను పని చేస్తానని దాస్‌ స్పష్టం చేశారు. 


logo
>>>>>>