Suresh Pujari : ఒడిషా తదుపరి సీఎం ఎవరనే విషయంలో మంగళవారం స్పష్టత రానుంది. భువనేశ్వర్లో రేపు జరిగే పార్టీ శాసనసభా పక్ష సమావేశానికి కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, భూపేంద్ర యాదవ్ పరిశీలకులుగా రానున్నారు.
ఎమ్మెల్యేల నుంచి ఏకాభిప్రాయం సాధించి తదుపరి ఒడిషా సీఎంను ప్రకటిస్తారని రాష్ట్ర బీజేపీ నేత సురేష్ పూజారి తెలిపారు. జూన్ 12న ఒడిషా సీఎం ప్రమాణ స్వీకారం ఉంటుందని ఆయన చెప్పారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతారని వెల్లడించారు.
ఒడిషా నుంచి 20 లోక్సభ స్ధానాలను అందించడంతో పాటు తదుపరి ప్రభుత్వ ఏర్పాటుకు స్పష్టమైన తీర్పు ఇచ్చిన రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు పార్టీ నిర్వహించే రోడ్షోలోనూ ప్రధాని పాల్గొంటారని చెప్పారు. ఇక ఒడిషా సీఎం రేసులో సురేష్ పూజారి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
Read More :
Saripodhaa Sanivaaram | మీ విజ్ఞప్తులు వినబడ్డాయి.. నాని టీం సరిపోదా శనివారం నయా అప్డేట్