న్యూఢిల్లీ: రెండేండ్ల కంటే తక్కువ కాకుండా జైలు శిక్ష పడినవారు లేదా ఏడేండ్లు లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్ష విధించదగిన నేరానికి సంబంధించిన చార్జ్షీట్లో పేరున్న వారి ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డును రద్దు చేస్తామని కేంద్ర హోం శాఖ తెలిపింది.
పౌరసత్వ చట్టంలో సెక్షన్ 7డి అధికారాలను ఉపయోగించి ఈ నిర్ణయం తీసుకున్నామంది.