గురువారం 26 నవంబర్ 2020
National - Oct 12, 2020 , 17:10:10

పెరుగుతున్న దేశీయ విమాన ప్రయాణికులు..

పెరుగుతున్న దేశీయ విమాన ప్రయాణికులు..

న్యూఢిల్లీ : కరోనా నేపథ్యంలో కొన్నినెలలుగా విమాన ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గింది. లాక్‌డౌన్‌ ఎత్తివేతతో ఇప్పుడిప్పుడే పరిస్థితి మెరుగవుతోంది. క్రమంగా ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. ఆదివారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా దాదాపు 1,78,431 మంది విమానాల్లో ప్రయాణించినట్లు కేంద్ర విమానయానశాఖ మంత్రి హర్దిప్‌సింగ్‌ పూరి తెలిపారు. ఆది, సోమవారాల్లో దేశవ్యాప్తంగా 3,024 విమానాల్లో 3.56 లక్షల మంది ప్రయాణించారు.

ఈ నెల చివరి నాటికి దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య రోజుకు 2 లక్షలకు చేరే అవకాశముందని వెల్లడించారు. డిసెంబర్‌ నాటికి 3 లక్షల మంది ప్రయాణించవచ్చని అంచనా వేశారు. కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మార్చి 25 నుంచి అన్నీ వాణిజ్య విమానాల రాకపోకలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది.  మే 25 నుంచి క్రమంగా దేశీయ విమానాల రాకపోకలను పునరుద్ధరించిన విషయం తెలిసిందే.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.