(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): ‘వికసిత్ భారత్’, ‘5 ట్రిలియన్ డాలర్ ఎకానమీ’ అంటూ కేంద్రంలోని మోదీ (PM Modi) ప్రభుత్వం ఒకవైపు ఆర్భాటపు ప్రచారాలు చేసుకొంటున్నది. అయితే, దేశంలో నెలకొన్న తీవ్రమైన సమస్యలు పౌరులను మాత్రం ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీంతో బీజేపీ పాలనలో దేశ పౌరసత్వాన్ని (Citizenship) వదులుకొని విదేశాలకు వెళ్లిపోతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్నది. గత ఐదేండ్లలో ఇండియన్ సిటిజెన్‌షిప్‌ను వదులుకొన్న వారి సంఖ్య 9 లక్షలుగా ఉన్నట్టు శుక్రవారం ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు విదేశీ వ్యవహారాల శాఖ పార్లమెంట్‌కు తెలియజేసింది.
14 ఏండ్లలో 20 లక్షల మంది బైబై
మోదీ ప్రభుత్వ హయాంలో లక్షలాది మంది భారతీయులు ఇక్కడి పౌరసత్వాన్ని వదులుకొంటున్నారు. 2024లోనే 2,06,378 మంది ఇండియన్ సిటిజన్‌షిప్‌ను వదులుకొన్నారు. మొత్తంగా గడిచిన ఐదేండ్లలో 9 లక్షల మంది, 11 ఏండ్లలో 17 లక్షల మంది, 14 ఏండ్లలో 20 లక్షల మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకొన్నట్టు కేంద్రం వెలువరించిన గణాంకాలను బట్టి అర్థమవుతున్నది. 2014లో ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి భారత పౌరసత్వాన్ని వదులుకొంటున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నది. బీజేపీ పాలనలో నెలకొన్న సమస్యలే ఇండియన్స్.. విదేశాల వైపు మొగ్గు చూపడానికి కారణమని నిపుణులు ఆరోపిస్తున్నారు.
కారణాలు ఎన్నెన్నో..
దేశంలో ఆర్థిక మందగమనం, నిరుద్యోగిత రేటు పెచ్చరిల్లుతున్నది. మోదీ ప్రభుత్వ హయాంలో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ అథః పాతాళానికి చేరింది. డాలర్ మారకంతో రూపాయి విలువ 90.56 మార్క్‌ను దాటడం ఆందోళన కలిగిస్తున్నది. ప్రభుత్వ ప్రోత్సాహకాలు లేకపోవడంతో గడిచిన ఐదేండ్లలోనే 2 లక్షలకు పైగా కంపెనీలు మూతబడ్డాయి. ప్రభుత్వం.. పన్ను రేట్లను అమాంతం పెంచింది. దేశంలోని దుర్భర పరిస్థితులతో విసిగిపోయిన లక్షలాది మంది పౌరులు.. విదేశాల్లో మెరుగైన జీవనం, ఆర్థిక పరిస్థితులు ఉండటంతో ఇండియన్ సిటిజెన్‌షిప్‌ను వదులుకొని విదేశీబాట పడుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఏ దేశాల కోసం పౌరసత్వాన్ని ఎక్కువగా వదులుకొంటున్నారు?
ఎందుకు విడిచిపోతున్నారంటే??
నరేంద్ర మోదీ పాలనలో పౌరసత్వాన్ని వదులుకొన్న వారు ఇలా..
ఏండ్లలోఏ సంవత్సరం.. ఎంతమంది?
సంవత్సరం పౌరసత్వం వదులుకొన్నవారు