న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా క్రియాశీలక కొవిడ్-19 కేసుల సంఖ్య 7,400కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం తెలిపింది. 24 గంటల్లో కొత్తగా 269 కేసులు నమోదైనట్లు, తొమ్మిది మంది మరణించినట్లు వెల్లడించింది.
కర్ణాటకలో ఒక రోజులోనే 132 క్రియాశీలక కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో నలుగురు, కేరళలో ముగ్గురు, రాజస్థాన్, తమిళనాడులలో ఒక్కొక్కరు మరణించారు.