CM Siddaramaiah: దక్షిణాది రాష్ట్రాలకు ఉత్తరాది రాష్ట్రాలు రుణపడి ఉన్నాయి: కర్నాటక సీఎం
CM Siddaramaiah:కర్నాటక సీఎం సిద్ధరామయ్య తీవ్ర ఆరోపణలు చేశారు. పన్ను చెల్లింపుల్లో దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం చేస్తోందన్నారు. దీని వల్ల గడిచిన నాలుగేళ్లలో రాష్ట్రానికి సుమారు 45 వేల కోట్ల నష్టం వచ్చిందన్నారు. కన్నడ ప్రజలు చెల్లిస్తున్న పన్నులు కష్ట సమయాల్లో ఆ ప్రజలకు ఉపయోగపడడం లేదన్నారు.
బెంగుళూరు: కేంద్ర సర్కారుపై కర్నాటక సీఎం సిద్ధరామయ్య(CM Siddaramaiah) తీవ్ర ఆరోపణలు చేశారు. పన్ను చెల్లింపుల్లో దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం చేస్తోందన్నారు. దీని వల్ల గడిచిన నాలుగేళ్లలో రాష్ట్రానికి సుమారు 45 వేల కోట్ల నష్టం వచ్చిందన్నారు. కన్నడ ప్రజలు చెల్లిస్తున్న పన్నులు కష్ట సమయాల్లో ఆ ప్రజలకు ఉపయోగపడడం లేదన్నారు. బదులుగా ఆ డబ్బు ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్తున్నట్లు ఆయన ఆరోపించారు. ఆదివారం తన ఎక్స్ అకౌంట్లో ఆయన ఓ ట్వీట్ చేశారు. కర్నాటక రాష్ట్ర సంక్షేమం కోసం న్యాయమైన రీతిలో తమకు రావాల్సిన నిధుల్ని ఇవ్వాలని ఆయన కోరారు. రాష్ఠ్రానికి రావాల్సిన గ్రాంట్ల విషయంలో కేంద్రం నిర్లిప్తతంగా వ్యవహరిస్తోందని, తమ రాష్ట్రానికి రావాల్సిన నిధుల్ని తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి ఏడో తేదీన కర్నాటక సీఎంతో పాటు ఎంపీలు ఢిల్లీలో ధర్నా చేపట్టనున్నారు.దక్షిణాది రాష్ట్రాల సొమ్మును ఉత్తరాది రాష్ట్రాలకు వాడుతున్నారని, ఉత్తరాది రాష్ట్రాలు తమకు రుణపడి ఉన్నట్లు సీఎం సిద్దరామయ్య తెలిపారు. ఆ రాష్ట్రాలు ఎన్నడూ తమకు మోడల్‌గా నిలవలేవన్నారు.
Karnataka has faced significant challenges with a reduced tax devolution share post the 15th Finance Commission, resulting in a loss of over Rs 45,000 crore in the last 4 years. This injustice cannot stand.
We stand united in demanding fair treatment and justice for Kannadigas…
— Siddaramaiah (@siddaramaiah) February 4, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

