Bengaluru Metro | వస్త్రధారణ కారణంగా రైతుకు నో ఎంట్రీ.. బెంగళూరు మెట్రో రైలు అధికారులపై నెటిజన్లు ఫైర్
Bengaluru Metro | రోజూ లక్షల మందికి ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేషన్ లిమిటెడ్ (బీఎంఆర్సీఎల్) వివాదంలో చిక్కుకుంది. మెట్రోలో సెక్యూరిటీ సూపర్వైజర్ (security supervisor) చేసిన ఓ పనికి విమర్శలు వెల్లువెత్తున్నాయి.
Bengaluru Metro | రోజూ లక్షల మందికి ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేషన్ లిమిటెడ్ (బీఎంఆర్సీఎల్) వివాదంలో చిక్కుకుంది. మెట్రోలో సెక్యూరిటీ సూపర్వైజర్ (security supervisor) చేసిన ఓ పనికి విమర్శలు వెల్లువెత్తున్నాయి. స్థానికులు మెట్రో కార్పొరేషన్ అధికారులపై సామాజిక మాధ్యమాల వేదికగా దుమ్మెత్తిపోస్తున్నారు.
ఇంతకీ ఏం జరిగిందంటే.. ట్రాఫిక్ నగరంగా పేరు గాంచిన బెంగళూరు మహానగరంలో ప్రజలు ఎక్కువగా మెట్రో రవాణానే (Bengaluru Metro) అనుసరిస్తుంటారు. ఉద్యోగులు, సామాన్యులు ఇలా నిత్యం లక్షల మంది మెట్రో రైలులో రాకపోకలు సాగిస్తుంటారు. ఓ రైతు కూడా మెట్రో రైలు ఎక్కేందుకు ఆదివారం బెంగళూరులోని రారాజీనగర్ మెట్రో స్టేషన్‌కు (Rajajinagar metro station) వెళ్లాడు. అయితే, ఆ రైతును సెక్యూరిటీ సూపర్వైజర్ అడ్డుకున్నాడు. తన వస్త్రధారణ కారణంగా (బట్టలు మురికిగా ఉన్నాయని) రైతును లోపలికి అనుమతించలేదు. టికెట్ ఉందని రైతు చూపించినప్పటికీ ఆయన్ని లోపలికి రావడాన్ని నిరాకరించాడు. సెక్యూరిటీ గేటు వద్ద ఆపేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో ఈ ఘటన వివాదాస్పదమైంది.
వీడియో చూసిన నెటిజన్లు ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. బెంగళూరు మెట్రోను దారుణంగా ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. #BengaluruMetroOnlyforVIP హ్యాష్‌ట్యాగ్‌తో విరుచుకుపడ్డారు. ‘నమ్మశక్యం కానిది..! మెట్రో కేవలం వీఐపీలకు మాత్రమేనా..?’, ‘మెట్రో రైల్లో ప్రయాణించాలంటే డ్రెస్ కోడ్ ఉండాలా..?’ అంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. రైతును అవమానించిన అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆ వీడియోని బెంగళూరు మెట్రో యాజమాన్యానికి ట్యాగ్ చేశారు.
విమర్శల నేపథ్యంలో బీఎంఆర్సీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ స్పందించారు. రైతు పట్ల అవమానకరంగా ప్రవర్తించిన సదరు సెక్యూరిటీ సూపర్వైజర్ను విధుల నుంచి సస్పెండ్ చేశారు. మెట్రో ప్రయాణం కోసం నిర్దిష్ట దుస్తులను తప్పనిసరి చేసే నియమం ఏదీ లేదని తెలిపారు. ఇలా వేషధారణ కారణంగా ప్రవేశాన్ని తిరస్కరించడం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు.
UNBELIEVABLE..! Is metro only for VIPs? Is there a dress code to use Metro?
I appreciate actions of Karthik C Airani, who fought for the right of a farmer at Rajajinagar metro station. We need more such heroes everywhere. @OfficialBMRCL train your officials properly. #metro pic.twitter.com/7SAZdlgAEH— Deepak N (@DeepakN172) February 24, 2024
Also Read..
Israeli embassy | ఇజ్రాయెల్ ఎంబసీ ఎదుట.. అమెరికా ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం
Russia – Ukraine War | ఆ వార్తలు అవాస్తవం.. రష్యా ఆర్మీ నుంచి భారతీయులందరినీ విడిపిస్తాం : కేంద్రం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

