ముంబై: బాలీవుడ్ నటి ఖుషీ ముఖర్జీ(Khushi Mukherjee) బాంబు పేల్చింది. భారత క్రికెటర్, టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గురించి కామెంట్ చేసింది. గతంలో సూర్య కుమార్ తనకు తరుచూ మెసేజ్ చేసేవాడని చెప్పింది. ప్రస్తుతం ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ లేదని పేరన్కొన్నది. ఎవరైనా క్రికెటర్‌తో డేటింగ్ చేయాలనుకుంటున్నారా అని ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు నటి ఖుషీ సమాధానం ఇచ్చింది. తనకు లింకప్‌లు అంటే ఇష్టం లేదని పేర్కొన్నది. ఏ క్రికెటర్‌తోనూ డేటింగ్ చేయాలని లేదని, ఎంతో మంది క్రికెటర్లు వెంటపడ్డారని, సూర్యకుమార్ యాదవ్ తనకు చాలా మెసేజ్‌లు చేసేవాడని, ఇప్పుడు తామేమీ మాట్లాడుకోవడం లేదని, ఎవరితోనూ కలవాలన్న ఉద్దేశం కూడా లేదని ఖుషీ తెలిపింది. కిద్దాన్ ఎంటర్టైన్మెంట్ ఆమె వీడియోను ఇన్‌స్టాలో పోస్టు చేసింది.
నటి ఖుషీ చేసిన వ్యాఖ్యలపై క్రికెటర్ సూర్యకుమార్ ఇంకా స్పందించలేదు. ప్రస్తుతం ఆయన తన భార్య దివిషా శెట్టితో కలిసి వైకుంభ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వెళ్లారు. సంప్రదాయ దుస్తుల్లో దంపతులు ఇద్దరూ దైవదర్శనం చేసుకున్నారు. రంగనాయకుల వారి మండపంలో ఆ దంపతులను పూజారులు దీవించారు.
Tirumala, Andhra Pradesh: Indian cricketer Suryakumar Yadav and his wife offeres prayers at the Tirumala Sri Venkateswara Swamy Temple on the occasion of Vaikuntha Ekadashi pic.twitter.com/1hjEVbhWDb
— IANS (@ians_india) December 30, 2025