Russia – Ukraine War | ఆ వార్తలు అవాస్తవం.. రష్యా ఆర్మీ నుంచి భారతీయులందరినీ విడిపిస్తాం : కేంద్రం
Russia - Ukraine War | రష్యా-ఉక్రెయిన్ యుద్ధం (Russia - Ukraine War)లో రష్యా తరఫున పలువురు భారతీయులు (Indians) పోరాడుతున్న విషయం తెలిసిందే. వీరంతా ఇప్పుడు రష్యా నుంచి బయటపడేందుకు సాయం కోరుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలను తాజాగా భారత్ తోసిపుచ్చింది.
Russia – Ukraine War | రష్యా-ఉక్రెయిన్ యుద్ధం (Russia – Ukraine War)లో రష్యా తరఫున పలువురు భారతీయులు (Indians) పోరాడుతున్న విషయం తెలిసిందే. వారంతా మాస్కో సైన్యానికి సహాయకులుగా పనిచేస్తున్నారు. ఈ విషయాన్ని కేంద్రం కూడా అంగీకరించింది. అయితే, వీరంతా ఇప్పుడు రష్యా నుంచి బయటపడేందుకు సాయం కోరుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు పలు మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో వరుస కథనాలు వస్తున్నాయి. ఈ వార్తలను తాజాగా భారత్ తోసిపుచ్చింది. ఆ వార్తలు అవాస్తవమని స్పష్టం చేసింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ (Ministry of External Affairs) సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
రష్యా సైన్యం (Russian Army)తో కలిసి పనిచేస్తున్న భారతీయులు అక్కడి నుంచి బయటపడేందుకు సాయం కోరుతున్నారంటూ మీడియాలో వచ్చిన కచ్చితత్వం లేని కథనాలు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపింది. మాస్కోలోని భారత ఎంబసీ దృష్టికి వచ్చే ప్రతి కేసు గురించి తాము అధికారులతో చర్చిస్తున్నట్లు పేర్కొంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ దృష్టికి వచ్చిన వాటిని కూడా ఢిల్లీలోని రష్యా రాయబార కార్యాలయం దృష్టికి తీసుకెళ్తున్నట్లు తెలిపింది. ఫలితంగా ఇప్పటికే కొంత మంది భారతీయులను అక్కడి సైన్యం నుంచి వెనక్కి తీసుకొచ్చినట్లు వివరించింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు వెల్లడించింది. రష్యా సైన్యం నుంచి భారతీయులందరినీ వీలైనంత త్వరగా విడుదల చేయించేందుకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటనలో స్పష్టం చేసింది.
Also Read..
Drug Racket | అంతర్జాతీయ డ్రగ్స్ దందా.. నిర్మాతను పార్టీ నుంచి తొలగించిన డీఎంకే
Texas | అమెరికాలో భారత సంతతి ఇంజినీర్‌కు టెక్సాస్ అత్యున్నత అకడమిక్ అవార్డు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

