Mukesh Ambani | జామ్‌నగర్‌లో అనంత్-రాధికల ప్రీవెడ్డింగ్ వేడుకలు.. అతిథుల కోసం అల్ట్రా లగ్జరీ టెంట్స్
Mukesh Ambani | రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, అపర కుబేరుడు ముకేశ్ అంబానీ (Mukesh Ambani ) ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. మార్చి 1వ తేదీ నుంచి మూడు రోజల పాటు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరగనున్నాయి.
Mukesh Ambani | రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, అపర కుబేరుడు ముకేశ్ అంబానీ (Mukesh Ambani ) ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ముకేశ్ అంబానీ-నీతా అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ (Anant Ambani ) వివాహం రాధిక మర్చంట్ (Radhika Merchant)తో జులై 12న జరగనుంది. దీంతో అంబానీ కుటుంబం ఇప్పటికే పెళ్లి పనులు మొదలు పెట్టేసింది. వారం రోజుల క్రితం లగ్నపత్రిక కూడా రాసుకున్నారు. ఇక మార్చి 1వ తేదీ నుంచి మూడు రోజల పాటు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరగనున్నాయి. ఈ ముందస్తు వివాహ వేడుకలను గుజరాత్ (Gujarat)లోని జామ్‌నగర్ (Jamnagar)లో నిర్వహించనున్నారు.
ఈ వేడుకకు అతిరథ మహారథులు విచ్చేయనున్నారు. అయితే, జామ్‌నగర్‌లో ఫైవ్‌స్టార్ హోటళ్లు లేకపోవడంతో వాటికి ఏమాత్రం తగ్గకుండా వేడుకల కోసం వచ్చే బిలియనీర్ గెస్ట్‌లకు అంబానీ కుటుంబం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఫైవ్‌స్టార్ హోటళ్లను తలదన్నే విధంగా గెస్ట్‌లు స్టే చేసేందుకు అల్ట్రా లగ్జరీ టెంట్ (ultra luxury tent)లను ఏర్పాటు చేస్తున్నారు. అతిథుల కోసం ఏర్పాటు చేసే ఈ విలాసవంతమైన టెంట్లలో టైల్డ్ బాత్రూమ్స్ సహా సకల సదుపాయాలూ ఉంటాయి.
ముందస్తు వేడుకలకు అతిథుల లిస్ట్..
ముందస్తు వివాహ వేడుకలకు ఆహ్వానాలు అందిన వారిలో బాలీవుడ్ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్ సహా క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ ఉన్నారు. వ్యాపార దిగ్గజాల్లో మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్, అడోబ్ సీఈఓ శంతను నారాయణ్, బ్లాక్ రాక్ సీఈఓ లారీ ఫింగ్, అడ్నాక్ సీఈఓ సుల్తాన్ అహ్మద్, వాల్ట్ డిస్నీ సీఈఓ బాబా ఐగర్ వంటి వారు ఉన్నారు. అలాగే దేశీయ వ్యాపార దిగ్గజాల్లో గౌతమ్ అదానీ, టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్, గోద్రేజ్ కుటుంబం, ఇన్ఫోసిస్ ఛైర్మన్ నందన్ నీలేకనీ, బిర్లా గ్రూప్ ఛైర్ పర్సన్ కుమార్ మంగళం బిర్లా, ఆర్పీఎస్జీ గ్రూప్ హెడ్ సంజీవ్ గోయెంకా, అదర్ పూనావాలా, సునీల్ మిట్టల్, పవన్ ముంజాల్, నిఖిల్ కామత్, దిలీప్ సంఘ్వీ వంటి వారు ఉన్నారు.
కాబోయే కోడలికి ఖరీదైన గిఫ్ట్‌లు..
ముకేశ్ అంబానీ దంపతులు కాబోయే కోడలు ‘రాధికా మర్చంట్’కు ఖరీదైన గిఫ్టులు అందించారు. వాటిలో కోట్ల రూపాయల ఖరీదుచేసే కారు, లక్షల విలువైన వెండి, వజ్రాభరణాలు ఉన్నాయి. అత్తింటి వారు తమ కాబోయే కోడలికి ముందుగానే సుమారు రూ.4.5 కోట్ల విలువచేసే బెంట్లీ కారు, వెండితో చేసిన లక్ష్మీ గణపతి విగ్రహం, డైమండ్ నెక్లెస్‌లను గిఫ్ట్‌గా ఇచ్చినట్లు సమాచారం.
Also Read..
Texas | అమెరికాలో భారత సంతతి ఇంజినీర్‌కు టెక్సాస్ అత్యున్నత అకడమిక్ అవార్డు
Arvind Kejriwal | ఈడీ విచారణకు కేజ్రీవాల్ ఏడో సారీ డుమ్మా.. ఈ వ్యవహారం కోర్టులో ఉందన్న ఆప్
Earthquake | ఇండోనేషియాను కుదిపేసిన భూకంపం.. 5.6 తీవ్రతతో బలమైన ప్రకంపనలు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

