Drug Racket | దేశంలో భారీ డ్రగ్స్ రాకెట్ (Drug Racket) గుట్టురట్టైన విషయం తెలిసిందే. ఢిల్లీ పోలీసులు (Delhi police), ఎన్సీబీ (NCB) అధికారులు సంయుక్త ఆపరేషన్ చేపట్టి అంతర్జాతీయ డ్రగ్ నెట్‌వర్క్‌ను చేధించారు. ఈ దందాలో తమిళనాడుకు చెందిన సినీ నిర్మాత (Tamil film producer ) ఏఆర్ జాఫర్ సాదిక్ (AR Jaffer Sadiq) కీలక సూత్రధారి అని పోలీసులు గుర్తించారు.
సాదిక్ తమిళనాడు (Tamil Nadu)లోని అధికార డీఎంకే (DMK)కి చెందిన వ్యక్తి. ప్రస్తుతం అతడు డీఎంకే ఎన్ఆర్ఐ విభాగానికి చెందని ఆఫీస్ బేరర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీ డ్రగ్ రాకెట్లో ఆయన కీలక పాత్ర ఉన్నట్లు అధికారులు గుర్తించడంతో.. డీఎంకే సాదిక్‌పై చర్యలు తీసుకుంది. ఆయనపై వేటు వేసింది. క్రమశిక్షణను ఉల్లంఘించి పార్టీకి చెడ్డపేరు తెచ్చినందుకు గానూ ఆయన్ని విధుల నుంచి తొలగించింది. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతోపాటు ఎన్ఆర్ఐ విభాగం నుంచి తొలగిస్తున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి దురైమురుగన్ ప్రకటించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే డ్రగ్స్ రాకెట్లో సాదిక్ ప్రమేయంపై ఆ ప్రకటనలో ఎలాంటి ప్రస్తావనా తీసుకురాలేదు.
మరోవైపు ఈ వ్యవహారం తమిళనాడు రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమైంది. అధికార డీఎంకేపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. తాజా అంశంపై సీఎం స్టాలిన్ వివరణ ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నాయి.
కాగా, ఈ డ్రగ్ నెట్వర్క్ భారతదేశం, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, మలేషియాలకు విస్తరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో ముగ్గురు వ్యక్తుల్ని ఢిల్లీలో అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. వారి నుంచి 50 కిలోల సూడోఎఫెడ్రిన్‌ను (pseudoephedrine) స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. హెల్త్ మిక్స్ పౌడర్, ఎండు కొబ్బరి వంటి ఆహార పదార్థాల ముసుగులో కొన్ని సరకుల ద్వారా దీనిని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించారు.
గత 3 ఏళ్లలో వీరు మొత్తం 45 సరకులు పంపారని, అందులో సుమారు 3,500 కిలోల సూడోఎఫెడ్రిన్ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. దాని విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ.2000 కోట్లకు పైగా ఉంటుందని చెప్పారు. అంతేకాదు మొత్తం నెట్‌వర్క్‌ను చేధించడానికి ఆయా దేశాల్లో ఉన్న నిందితులను కూడా అరెస్టు చేయడానికి న్యూజిలాండ్, ఆస్ట్రేలియా అధికారులను సంప్రదించినట్లు పోలీసులు (police) వెల్లడించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న సాదిక్ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read..
Texas | అమెరికాలో భారత సంతతి ఇంజినీర్‌కు టెక్సాస్ అత్యున్నత అకడమిక్ అవార్డు
Arvind Kejriwal | ఈడీ విచారణకు కేజ్రీవాల్ ఏడో సారీ డుమ్మా.. ఈ వ్యవహారం కోర్టులో ఉందన్న ఆప్