హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 30 : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను(Labour Codes) రద్దు చేయాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. కాకతీయ యూనివర్సిటీ మొదటి గేట్ ఎదుట కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆల్ యూనివర్సిటీస్ ఎంప్లాయిస్ వర్కర్స్యూనియన్ సిఐటియు కేయూ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆల్ యూనివర్సిటీస్ ఉపాధ్యక్షుడు పుల్లా శ్రీనివాస్, యూనివర్సిటీస్ రాష్ర్ట అధ్యక్షుడు మెట్టు రవి మాట్లాడుతూ.. విద్యుత్ సవరణ చట్టం 2025ను, విత్తన సవరణ చట్టం, విబిజీ రాంజీ స్కీమును రద్దు చేయాలని ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని, ఈపీఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం కార్మిక కర్షక ప్రజావ్యతిరేక విధానాలను విడనాడాలని లేకపోతే పెద్దఎత్తున ఉద్యోగ, కార్మికవర్గం ఉద్యమిస్తుందని వారు హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా జనవరి 19న దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో ప్రదర్శనలు, బహిరంగ సభలు నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్ష, కార్యదర్శులు ఆకుతోట రామచందర్, దేశిని రవికుమార్, ఉపాధ్యక్షుడు కచ్చకాయల చిరంజీవి, ఎర్రెల్లి శోభన్, భూక్య కిషన్, పల్లం రాజు, శోభ, నవీన్, మధు, రణధీర్, రాజేందర్, ఉద్యోగులు పాల్గొన్నారు.