Vande Bharat Sleeper | దేశంలో తొలి వందేభారత్ స్లీపర్ (Vande Bharat Sleeper) రైలు త్వరలో పట్టాలెక్కేందుకు సిద్ధమైంది. ఈ నెల చివరికల్లా ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. గువాహటి-కోల్‌కతా మధ్య తొలి వందే భారత్ స్లీపర్ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రైలును జెండా ఊపి ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
భారతదేశపు మొట్టమొదటి ఈ వందే భారత్ స్లీపర్ రైలు కేవలం సామాన్య ప్రజల కోసమే అందుబాటులో ఉంటుందని సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి. ఇందులో వీఐపీ కోటా ఉండదట (No VIP Quota). అంతేకాదు, ఎలాంటి ట్రావెల్ పాస్‌లను అనుమతించరు. అత్యవసర కోటాలకు కూడా అనుమతి ఉండదు. మహిళలు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్ కోటా ఉంటుంది. రైల్వే శాఖకు చెందిన ఉన్నతాధికారులు, సీనియర్ అధికారులు కూడా సాధారణ ప్రయాణికుల్లానే ఇందులో ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ రైలులో ప్రయాణికులకు కేవలం కన్ఫామ్ అయిన టికెట్లను (Confirmed Tickets) మాత్రమే జారీ చేస్తారు. దీని వల్ల వెయిటింగ్ లిస్ట్ సమస్య గణనీయంగా తగ్గుతుంది.
Also Read..
Dhruva Space: గతితప్పిన పీఎస్ఎల్వీ-సీ62.. ద్రువ స్పేస్ కంపెనీకి తీవ్ర నిరాశ !
Bengaluru techie | బెంగళూరు టెకీ కేసులో సంచలనం.. లైంగిక దాడిని అడ్డుకున్నందుకు యువతి హత్య
Bangladesh Balloon | బంగ్లాదేశ్ నుంచి బెలూన్.. అస్సాంలో ల్యాండ్