Landslides | ప్రకృతి విపత్తుపై కేరళ రాష్ట్రాన్ని వారం ముందే హెచ్చరించామంటూ.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) చేసిన ప్రకటనను ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ (Veena George) ఖండించారు. కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని కేంద్రం నుంచి తమకు ఎలాంటి ముందస్తు అలర్ట్ రాలేదని (No Red Alert Issued By Centre) తెలిపారు. అమిత్ షా ప్రకటన తప్పుదారి పట్టించేదిగా ఉందని వ్యాఖ్యానించారు. ‘కేంద్రం నుంచి వచ్చిన అన్ని సందేశాలను క్షుణ్ణంగా పరిశీలించాం. కొండచరియలు విరిగిపడటానికి సంబంధించి ఎలాంటి ముందస్తు అలర్ట్ జారీ చేయలేదు. జిల్లా యంత్రాంగం ఆరెంజ్ హెచ్చరికలు ఇచ్చింది. దీని ఆధారంగా వయనాడ్ యంత్రాంగం నివారణ చర్యలను చేపట్టింది. అనేక మంది నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించింది’ అని వీణా జార్జ్ వెల్లడించారు.
కేరళను ముందే హెచ్చరించాం : అమిత్ షా
కాగా, భారీ వర్షాల నేపథ్యంలో కొండచరియలు (Landslides) విరిగిపడే అవకాశం ఉందని కేరళ ప్రభుత్వాన్ని ముందే హెచ్చరించినట్లు (Kerala Given Early Warning) కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) బుధవారం తెలిపారు. ఈ ప్రకృతి వైపరీత్యం గురించి పినరయి విజయన్ నేతృత్వంలోని కేరళ ప్రభుత్వాన్ని వారం రోజుల ముందే అప్రమత్తం చేసినట్లు చెప్పారు.
ఈ మేరకు కేరళలో చోటు చేసుకున్న ప్రకృతి వైపరీత్యంపై పార్లమెంట్లో ప్రకటన చేశారు.‘కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని కేరళ ప్రభుత్వాన్ని ముందే హెచ్చరించాం. ఈ ముప్పు గురించి జులై 23నే అప్రమత్తం చేశాం. దక్షిణాది రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసి.. కేంద్రం తొమ్మిది ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కేరళకు పంపింది. కానీ, కేరళ ప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. సకాలంలో ప్రజలను తరలించలేదు. ఎన్డీఆర్ఎఫ్ బృందాల రాకతో పినరయి విజయన్ ప్రభుత్వం అప్రమత్తమై ఉండి ఉంటే.. ఇప్పుడు ఇన్ని మరణాలు సంభవించేవి కావు. ఏది ఏమైనప్పటికీ రాజకీయాలకు అతీతంగా కేరళ ప్రభుత్వానికి, ప్రజలకు అండగా నిలవాల్సిన సమయం ఇది’ అని అమిత్‌షా పేర్కొన్నారు.
Also Read..
Building Washed Away | హిమాచల్‌లో క్లౌడ్ బరస్ట్.. సిమ్లాలో నదిలో కొట్టుకుపోయిన భారీ భవనం.. వీడియో
Harassing Woman | వరద నీటిలో బైక్‌పై వెళ్తున్న మహిళపై పోకిరీల దురుసు ప్రవర్తన.. వీడియో
Himachal Cloudburst | హిమాచల్‌ప్రదేశ్‌లో వర్ష బీభత్సం.. పలువురు గల్లంతు..!