Building Washed Away | హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)లో వర్షం బీభత్సం సృష్టించింది. కులులోని నిర్మంద్ బ్లాక్, మాలానా, మండి, సిమ్లా జిల్లాల్లో క్లౌడ్ బరస్ట్ (Cloudburst) కారణంగా కుండపోత వర్షం కురిసింది. దాంతో ఇండ్లు, పాఠశాలలతో పాటు ఆసుపత్రులు సైతం దెబ్బతిన్నాయి. ఈ వర్షాలకు రాష్ట్రంలోని పలు నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇక సిమ్లా జిల్లాలోని రాంపూర్ ప్రాంతంలో ఓ భారీ భవనం ఒక్కసారిగా కుప్పకూలింది (Building collapses). అనంతరం పార్వతీ నదిలో కొట్టుకుపోయింది (Building Washed Away). ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
కాగా, క్లౌడ్ బరస్ట్ కారణంగా మూడు ప్రాంతాల్లో దాదాపు 36 మంది గల్లంతయ్యారు. మండిలో ఒకరి మృతదేహం లభ్యమైంది. వర్షాల కారణంగా అప్రమత్తమైన అధికారులు మండిలోని విద్యాసంస్థలను మూసివేస్తూ డీసీ ఉత్తర్వులు జారీ చేశారు. మండి తాల్తుఖోడ్‌లో మంగళవారం అర్ధరాత్రి భారీ వర్షానికి పలుచోట్ల ఇండ్లు కూలినట్లు సమాచారం. రహదారులు దెబ్బతిన్నాయి. ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సంఘటనా స్థలానికి తరలించారు.
शिमला में बादल फटा, 32 लोग लापता
रामपुर क्षेत्र के झाकड़ी में हाइड्रो प्रोजेक्ट के नजदीक आज सुबह बादल फटा है
लापता होने वालों की सूची 32 तक पहुंच गई है।
मंडी में भी कल रात बादल फटने से करीब 19 लोग लापता हैं
एक पूरा बड़ा होटल नदी में बह गया#HimachalPradesh pic.twitter.com/nN2r3j6pvl
— Dr Raghawendra Mishra (@RaghwendraMedia) August 1, 2024
Also Read..
Harassing Woman | వరద నీటిలో బైక్‌పై వెళ్తున్న మహిళపై పోకిరీల దురుసు ప్రవర్తన.. వీడియో
Telangana Assembly | నల్లబ్యాడ్జీలతో అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..
Nagarjuna Sagar | నాగార్జున సాగర్‌కు కొనసాగుతున్న భారీ వరద