PM Kisan Yojana | న్యూఢిల్లీ, డిసెంబర్ 10: రైతులకు ఆర్థిక సహాయంగా కేంద్రం ప్రతి ఏడాది పీఎం-కిసాన్ పథకం కింద అందజేస్తున్న ఆరు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని పెంచే ప్రతిపాదన ఏదీ లేదని వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్నాథ్ ఠాకూర్ స్పష్టం చేశారు.
ప్రతి ఏడాది కేంద్రం రూ.2 వేలు చొప్పున మూడు విడతలుగా రూ.6 వేలను రైతులకు అందజేస్తున్నది. లోక్సభలో మంత్రి లిఖితపూర్వకంగా సమాధానం ఇస్తూ ఈ పథకం కింద ఇప్పటివరకు 18 విడతల్లో రూ.3.46 లక్షల కోట్లను రైతులకు అందజేసినట్టు చెప్పారు. దళారుల ప్రమేయం లేకుండా రైతుల ఖాతాల్లో ఈ మొత్తాన్ని నేరుగా వేస్తున్నట్టు ఆయన తెలిపారు.