న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునే అవకాశమే లేదని ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ మరోసారి స్పష్టం చేశారు. ‘ఇండియా’ కూటమిలోని ఈ రెండు పార్టీలు వచ్చే ఎన్నికల్లో జతకట్టనున్నాయన్న ఊహాగానాల్ని ఆయన తోసిపుచ్చారు. సొంతంగా ఎన్నికల బరిలో దిగుతున్నామని కేజ్రీవాల్ ప్రకటించారు. 70 అసెంబ్లీ స్థానాలున్న ఢిల్లీకి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే 31 స్థానాల్లో ఆప్ తన అభ్యర్థుల్ని ప్రకటించింది. 1998 నుంచి ఢిల్లీలో అధికారం దక్కించుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నది. 2015, 2020 ఎన్నికల్లో ఆప్ వరుసగా 67, 62 స్థానాల్ని గెలుచుకుంది.