జేఈఈ, నీట్ పరీక్షలు యథాతథం
ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జేఈఈ మెయిన్, నీట్ యూజీ పరీక్షలు వాయిదా పడే అవకాశం ఉందన్న ఊహాగానాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆదివారం కొట్టిపడేసింది.
- ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు: ఎన్టీఏ
- ఏప్రిల్ 4 15 మధ్య జేఈఈ మెయిన్ సెషన్ 2
న్యూఢిల్లీ, మార్చి 17: ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జేఈఈ మెయిన్, నీట్ యూజీ పరీక్షలు వాయిదా పడే అవకాశం ఉందన్న ఊహాగానాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆదివారం కొట్టిపడేసింది. పరీక్షల షెడ్యూల్లో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది. జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్షలు ఏప్రిల్ 1-15 మధ్య జరుగుతాయని గతంలో ప్రకటించగా, ఇటీవల మరో ప్రకటన చేస్తూ ఏప్రిల్ 4-15 మధ్య జరుగుతాయంటూ రివైజ్డ్ షెడ్యూల్ను ప్రకటించింది.
నీట్ యూజీ పరీక్షలు మే 5న జరగాల్సి ఉండగా, ముందుగా పేర్కొన్నట్టుగానే అప్లికేషన్ కరెక్షన్ విండో మార్చి 18 నుంచి మొదలవుతుంది. సీయూఈటీ యూజీ పరీక్షలు మే 15- 31 వరకు జరగాల్సి ఉండగా రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాక సీయూఈటీ షెడ్యూల్పై నిర్ణయం తీసుకుంటామని తొలుత చెప్పినప్పటికీ, ఈ షెడ్యూల్లోనూ ఎలాంటి మార్పు లేదని యూజీసీ చీఫ్ జగదీశ్కుమార్ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

