No Census In Manipur | ఎన్నార్సీపై నిరసనలకు దిగివచ్చిన కేంద్రం.. మణిపూర్‌లో జనాభా గణన వాయిదా
No Census In Manipur | జాతీయ పౌరసత్వ నమోదు (ఎన్నార్సీ) ప్రక్రియను పూర్తి చేయకుండానే జనాభా గణన చేపడతామన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయంపై మణిపూర్‌లో నిరసనలు ఉధృతమయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్రం దిగివచ్చింది. ఆ రాష్ట్రంలో జనాభా గణనను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
ఇంఫాల్: జాతీయ పౌరసత్వ నమోదు (ఎన్నార్సీ) ప్రక్రియను పూర్తి చేయకుండానే జనాభా గణన చేపడతామన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయంపై మణిపూర్‌లో నిరసనలు ఉధృతమయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్రం దిగివచ్చింది. ఆ రాష్ట్రంలో జనాభా గణనను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. (No Census In Manipur) సోమవారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన మణిపూర్‌లో ప్రస్తుత పరిస్థితులను సమీక్షించేందుకు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. మణిపూర్ గవర్నర్, సీఎం యుమ్నం ఖేమ్‌చంద్ సింగ్, కేంద్ర హోం కార్యదర్శి గోవింద్ మోహన్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్నార్సీ) అమలుకు ముందే రాష్ట్రంలో జనాభా గణన ప్రక్రియను వాయిదా వేయాలని మణిపూర్‌లోని పలు వర్గాలు చేసిన అభ్యర్థనపై ఈ సమావేశంలో చర్చించారు. మణిపూర్ ప్రజల మనోభావాలు, ఆకాంక్ష మేరకు ప్రతిపాదిత జనాభా గణన ప్రక్రియను వాయిదా వేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.
కాగా, 2023 నుంచి మణిపూర్‌లో మైతీ-కుకీ జాతుల మధ్య ఘర్షణల కారణంగా 250 మందికిపైగా ప్రజలు మరణించారు. 50,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారు. చాలా మంది ప్రజలు పలు ప్రాంతాలకు వలసపోయారు.
ఈ నేపథ్యంలో జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్నార్సీ) ప్రక్రియను పూర్తి చేయకుండానే జనాభా గణన చేపడతామన్న కేంద్రం నిర్ణయాన్ని మైతీ-నాగా ప్రజలు వ్యతిరేకించారు. ఈ వర్గాల నిరసనలు ఉధృతం కావడంతో కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చింది. మణిపూర్‌లో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా జనాభా గణన ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

