మంగళవారం 01 డిసెంబర్ 2020
National - Nov 21, 2020 , 16:50:43

ఆ కేసులో చందా కొచ్చర్ పై చర్యలుండవు : ఈడీ

ఆ కేసులో చందా కొచ్చర్ పై చర్యలుండవు : ఈడీ

ఢిల్లీ :మనీలాండరింగ్ కేసులో ఐసిఐసిఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్ కు ఊరట లభించింది. ఆమె పై ఎలాంటి చర్యలు ఉండవని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ )సుప్రీంకోర్టు కు తెలిపింది. జస్టిస్ ఎస్.కె కౌల్ నేతృత్వంలో ధర్మాసనం ముందు వాదన వినిపించిన ఈడి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఐసిఐసిఐ బ్యాంక్-వీడియోకాన్ గ్రూప్ లోన్ కేసులో నమోదైన ఈసిఐఆర్‌ను అనుసరించడానికి ఈడీ ఎటువంటి బలవంతపు చర్య తీసుకోదని స్పష్టం చేశారు.

ఈ కేసులో తన భర్త దీపక్ కొచ్చర్ అరెస్టును సవాలు చేస్తూ చందా కొచ్చర్ దాఖలు చేసిన పిటీషన్ తో పాటు చందా కొచ్చర్ బెయిల్ పిటిషన్లను తరువాత విచారించనున్నట్లు జస్టిస్ దినేష్ మహేశ్వరి, హృషికేశ్ రాయ్ లతో కూడిన ధర్మాసనం తెలిపింది. మనీలాండరింగ్ ఆరోపణలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఇటీవల చందా కొచ్చర్ , దీపక్ కొచ్చర్ , వీడియోకాన్ గ్రూప్ ప్రమోటర్ వేణుగోపాల్ ధూత్‌పై చార్జిషీట్ దాఖలు చేసింది. అయితే వారిపై ఈడీ ఆరోపణలను వారు ఖండించారు.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.