Nitin Nabin | భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా (BJP National Working President) బీహార్ మంత్రి నితిన్ నబిన్ (Nitin Nabin) బాధ్యతలు చేపట్టారు. దేశ రాజధాని ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చార్జ్ తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda), కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah), పార్టీ సీనియర్ లీడర్లు, నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్త బాధ్యతలు చేపట్టిన నితిన్ నబిన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. నితిన్ నబిన్ ప్రస్తుతం సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని బీహార్ ప్రభుత్వంలో రోడ్డు నిర్మాణ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్నారు. ఐదుసార్లు బీహార్ ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన కాయస్థ వర్గానికి చెందినవారు. వచ్చే జనవరి 14 తర్వాత నితిన్ నబిన్‌ను లాంఛనంగా పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read..
Actor Vijay | విజయ్ ఈరోడ్ ర్యాలీకి పర్మిషన్ గ్రాంటెడ్.. 84 కండిషన్స్
Dense Smog | పొగమంచు ఎఫెక్ట్.. ఢీ కొన్న 20 వాహనాలు.. నలుగురు మృతి
Dense Fog | ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. 100కుపైగా విమానాలు రద్దు