PM Modi | భారతీయ జనతా పార్టీ కొత్త జాతీయ అధ్యక్షుడి (BJP national president)గా నితిన్ నబిన్ (Nitin Nabin) ఇవాళ అధికారికంగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కొత్త అధ్యక్షుడికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయనపై ప్రశంసలు కురిపించారు. నబిన్ పార్టీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే మలీనియల్ అని అభివర్ణించారు. పార్టీ పరంగా నబిన్ తనకు బాస్ అని.. తాను మాత్రం పార్టీ కార్యకర్తనే అని ప్రధాని వ్యాఖ్యానించారు. ఇచ్చిన బాధ్యతలను నబిన్ విజయవంతంగా పూర్తి చేశారని ప్రశంసించారు.
భారతీయ జనతా పార్టీ కొత్త జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ (Nitin Nabin) పేరును ఆ పార్టీ ఇవాళ అధికారికంగా ప్రకటించింది. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో.. రిటర్నింగ్ ఆఫీసర్ కే లక్ష్మణ్ చేతుల మీదుగా జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన సర్టిఫికేట్‌ను నితిన్ అందుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ మాజీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొత్త అధ్యక్షుడిగా నితిన్ బాధ్యతలు స్వీకరించారు.
Also Read..
Vande Bharat Sleeper | వందే భారత్ స్లీపర్ ఫుడ్ మెనూ ఇదే..
Nitin Nabin: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నితిన్ నబిన్
RN Ravi: మైక్‌ను స్విచాఫ్ చేసి అవమానించారు.. అసెంబ్లీ నుంచి గవర్నర్ ఆర్ఎన్ రవి వాకౌట్