న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ కొత్త జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్(Nitin Nabin) ఎన్నియ్యారు. ఇవాళ అధికారికంగా ఆయన పేరును బీజేపీ ప్రకటించింది. ఢిల్లలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో.. రిటర్నింగ్ ఆఫీసర్ కే లక్ష్మణ్ చేతుల మీదుగా జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన సర్టిఫికేట్‌ను నితిన్ అందుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ మాజీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొత్త అధ్యక్షుడిగా నితిన్ బాధ్యతలు స్వీకరించారు.
45 ఏళ్ల వయసులోనే నితిన్ నబిన్ కీలక పదవిని చేపట్టారు. బీహార్‌లోని బంకిపుర్ సీటు నుంచి ఆయన వరుసగా అయిదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. బీజేపీ దివంగత నేత, మాజీ ఎమ్మెల్యే నబిన్ కిశోర్ ప్రసాద్ సిన్హా కుమారుడే ఆయన. బాధ్యతలు స్వీకరించడానికి ముందు ఇవాళ నితిన్ ఢిల్లీలోని పలు ఆలయాలను సందర్శించారు. జెండాలన్, వాల్మీకి, హనుమాన్ గుళ్లతో పాటు గురుద్వారా బంగ్లా సాహిబ్‌ను కూడా ఆయన దర్శించుకున్నారు.
నబిన్‌కు కేంద్ర హోంశాఖ జెడ్ కేటగిరీ భద్రతను ఏర్పాటు చేసింది. జెడ్ కేటగిరీలో సీఆర్పీఎఫ్ కమాండోలు ఉంటారు. ఇంటెలిజెన్స్ బ్యూరో ఇచ్చిన రిపోర్టు ఆధారంగా నబిన్‌కు జెడ్ కేటగిరీ భద్రతను ఇచ్చారు.
प्रधानमंत्री श्री @narendramodi की उपस्थिति में श्री @NitinNabin को भाजपा का राष्ट्रीय अध्यक्ष चुना गया।
इस अवसर पर प्रधानमंत्री जी ने उनका माल्यार्पण कर अभिनंदन किया और उन्हें बधाई दी। pic.twitter.com/8V0FLBlIDA
— BJP (@BJP4India) January 20, 2026