Vande Bharat Sleeper | దేశంలోని మొట్టమొదటి వందేభారత్ స్లీపర్ (Vande Bharat Sleeper) రైలు ప్రజలకు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. హౌరా-గౌహతి మధ్య తొలి స్లీపర్ రైలును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) శనివారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు పట్టాలెక్కినప్పటి నుంచి దీని గురించే విపరీతంగా చర్చ నడుస్తోంది. రైలు ఫీచర్స్ వంటి వాటి గురించి నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. అదే సమయంలో ఈ రైల్లో ప్రయాణికులకు అందించే ఫుడ్ మెనూ (Vande Bharat Sleeper Train Food Menu) నెట్టింట వైరల్ అవుతోంది.
వందే భారత్‌లో ప్రయాణించే ప్రయాణికుల కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) సహకారంతో గౌహతిలోని మేఫెయిర్ స్ప్రింగ్ వ్యాలీ రిసార్ట్.. బెంగాలీ, అస్సాం సంప్రదాయ వంటకాలతో ప్రత్యేకంగా మెనూను రూపొందించింది. ఈ మెనూలో బెంగాలీ స్పెషల్ డిషెస్ అయిన బాసంతి పులావ్, ఛోలార్ దాల్, మూంగ్ దాల్, ధోకర్ వంటి సంప్రదాయ వంటకాలు ఉన్నాయి. వీటితోపాటూ అస్సాం పాక సంప్రదాయాలను ప్రతిబింబించేలా జోహా రైస్, మతి మోహోర్, మసూర్ దాల్, సీజనల్ వెజిటబుల్ ఫ్రైస్ను జతచేశారు. ఇక స్వీట్స్‌లో సందేశ్, నారికోల్ బర్ఫీ, రసగుల్లాలను చేర్చారు. వీటన్నింటినీ మీడియం స్పైస్‌తో ప్రయాణికులు తినేవిధంగా తయారు చేసి అందిస్తున్నారు.
Also Read..
Kerala Governor | ప్రసంగంలోని కొన్ని అంశాలను చదవని గవర్నర్.. కేరళ ప్రభుత్వం అసంతృప్తి
Nitin Nabin: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నితిన్ నబిన్
Road Accident | కారు ప్రమాదంలో ఐదుగురు మహిళలు మృతి.. డ్రైవర్ అరెస్ట్