Nirmala Sitharaman : కేంద్ర బడ్జెట్లో మధ్యతరగతి, యువత సహా అన్ని వర్గాల వారికీ మేలు చేసే చర్యలు ప్రకటించామని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. మధ్యతరగతి, యువత, ఎంఎస్ఎంఈలు ఇలా అన్ని వర్గాల వారికీ ఈ బడ్జెట్లో ఉపకరించే ప్రకటనలు ఉన్నాయని చెప్పారు. విద్య, ఉన్నత విద్య కోసం సబ్సిడీ లేదా వడ్డీలేని రుణాలను పెద్దసంఖ్యలో అందచేస్తామని, ఇది స్వదేశంలో విద్య, ఉన్నత విద్య అభ్యసించాలని కోరుకునే మధ్యతరగతి కుటుంబాలకు నేరుగా లబ్ధి చేకూర్చుతుందని మంత్రి వివరించారు.
నిర్మలా సీతారామన్ ఆదివారం బెంగళూర్లో విలేకరులతో మాట్లాడారు. కర్నాటకకు కేంద్ర ప్రభుత్వం సరైన విధంగా నిధులు కేటాయించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు సత్యదూరమని చెప్పారు. గత పదేండ్లలో కర్నాటకకు కేంద్రం భారీగా నిధులు కేటాయించిందని గుర్తుచేశారు. కర్నాటకకు కేంద్రం తగినంతగా నిధులు కేటాయించలేదని ప్రభుత్వం ప్రజలను తప్పుదారిపట్టించేలా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
2004, 2014 మధ్య ఢిల్లీలో యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు కర్నాటకకు కేవలం రూ. 81,791 కోట్లు లభించగా, మోదీ పదేండ్ల పాలనలో కర్నాటకకు ఏకంగా రూ. 2,95,818 కోట్లు దక్కాయని చెప్పారు. యూపీఏ హయాంలో కర్నాటకకు రూ. 60,779 కోట్లు గ్రాంట్లు మంజూరు కాగా, మోదీ హయాంలో ఏకంగా రూ. 2.39 లక్షల కోట్లు వచ్చాయని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు.
Read More :