చెన్నై, ఏప్రిల్ 5 : ఒక దేశం, ఒకే ఎన్నికల ప్రతిపాదనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం తోసిపుచ్చారు. రానున్న 2029 ఎన్నికలలో ఇది అమలు కాదని, 2034 ఎన్నికల తర్వాతే ఇది అమలులోకి వస్తుందని ఆమె స్పష్టం చేశారు. 2024 లోక్సభ ఎన్నికల కోసం దాదాపు రూ. లక్ష కోట్లు ఖర్చయ్యిందని, జమిలి ఎన్నికల ద్వారా ఇంత భారీ మొత్తం ఆదా అవుతుందని ఆమె తెలిపారు. పార్లమెంట్, అసెంబ్లీల సభ్యులకు ఒకేసారి ఎన్నికలు జరపడం వల్ల దేశ జీడీపీకి 1.5 శాతం ప్రగతి జత కూడుతుందని ఆమె అన్నారు.