Treadmill | ట్రెడ్‌మిల్‌పై నడుస్తుండగా ఆగిన గుండె.. 19 ఏళ్ల యువకుడి హఠాన్మరణం.. Video
Treadmill | జిమ్‌లో వ్యాయమం చేస్తూ గుండెపోటుతో మరణించే ఘటనలు ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోయాయి. తాజాగా అలాంటిదే మరో ఘటన చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ సిటీలోగల ఓ జిమ్‌లో 19 ఏళ్ల యువకుడు వ్యాయామం చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
ఘజియాబాద్: జిమ్‌లో వ్యాయమం చేస్తూ గుండెపోటుతో మరణించే ఘటనలు ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోయాయి. తాజాగా అలాంటిదే మరో ఘటన చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ సిటీలోగల ఓ జిమ్‌లో 19 ఏళ్ల యువకుడు వ్యాయామం చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ట్రెడ్‌మిల్‌పై నడుస్తుండగా కార్డియాక్ అరెస్ట్ కావడంతో అతను అమాంతం చెట్టులా కూలిపోయాడు.
ఈ దృశ్యాలు జిమ్‌లో ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. యువకుడు కుప్పకూలిన తర్వాత కొన్ని క్షణాలకు జిమ్‌లో ఉన్న మరో ఇద్దరు వ్యక్తులు అతని దగ్గరికి వచ్చి సాయపడుతున్నట్లు సీసీ ఫుటేజ్‌లో కనిపిస్తున్నది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడు బీహార్ రాష్ట్రానికి చెందిన సిద్దార్థ్ కుమార్ సింగ్‌గా గుర్తించారు. సింగ్ మరణంతో కుటుంబసభ్యులు అతడి మృతదేహాన్ని బీహార్‌కు తీసుకెళ్లారు. కాగా, మితిమీరిన వ్యాయామం, మానసిక ఒత్తిళ్ల కారణంగానే జిమ్‌లో పనిచేస్తున్నప్పుడు గుండెపోటు, కార్డియాక్ అరెస్టుతో మరణిస్తున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు.
#Shocking
A 19 years old young man died while #running on a #treadmill in a #Gym in #Ghaziabad. #CCTV footage of this entire incident shows that this 19 year old boy fell on the treadmill and died.
It is believed that he died because of #heartattack #gymboy #run pic.twitter.com/9kuSZ0MlZC— Ravi Pratap Dubey (@ravipratapdubey) September 16, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

