Robert Vadra | అమేఠీ నుంచి రాబర్ట్ వాద్రా పోటీ..? చర్చకు దారితీస్తున్న పోస్టర్లు
Robert Vadra | లోక్‌సభ ఎన్నికల్లో ఇప్పుడు అందరి కళ్లూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అమేఠీ (Amethi) నియోజకవర్గంపైనే ఉన్నాయి.
Robert Vadra | లోక్‌సభ ఎన్నికల్లో ఇప్పుడు అందరి కళ్లూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అమేఠీ (Amethi) నియోజకవర్గంపైనే ఉన్నాయి. గాంధీ కుటుంబానికి ఈ స్థానం కంచుకోట అన్న విషయం తెలిసిందే. గతంలో ఈ స్థానం నుంచి సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ (Rahul Gandhi)లు ప్రాతినిథ్యం వహించారు. అయితే, 2019లో జరిగిన ఎన్నికల్లో రాహుల్ గాంధీ బీజేపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ చేతిలో ఓడిపోయారు. అమేఠీతోపాటు పోటీ చేసిన వయనాడ్‌లో మాత్రం రాహుల్ గెలుపొందారు.
దీంతో ఈసారి కూడా ఈ స్థానం నుంచి స్మృతీ ఇరానీనే బీజేపీ తన అభ్యర్థిగా ప్రకటించింది. అయితే, కాంగ్రెస్ మాత్రం ఇప్పటి వరకూ అమేఠీ నియోజకవర్గానికి అభ్యర్థిని ప్రకటించలేదు. రాహుల్ గాంధీ మాత్రం కేరళలోని వయనాడ్ నుంచి పోటీకి సిద్ధమయ్యారు. వయనాడ్‌తోపాటు అమేఠీ (Amethi)లో కూడా రాహుల్ పోటీ చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా అక్కడ వెలసిన ప్రియాంకా గాంధీ వాద్రా భర్త రాబర్ట్ వాద్రా (Robert Vadra) పోస్టర్లు చర్చకు దారితీస్తున్నాయి. అమేఠీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వెలుపల ‘అమేఠీ ప్రజలు ఈసారి రాబర్ట్ వాద్రాను కోరుకుంటున్నారు’ అంటూ పోస్టర్లు వెలిశాయి. దీంతో ఈ సారి అక్కడ రాహుల్ పోటీ ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఎన్నికల్లో అమేఠీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రాబర్ట్ వాద్రా నిలబడతారంటూ స్థానికంగా ప్రచారం జోరందుకుంది.
కాగా, అమేఠీ నుంచి పోటీ విషయంపై గతంలో రాబర్ట్ వాద్రా స్పందిస్తూ.. ఈ నియోజకవర్గ ప్రజలు తన ప్రాతినిధ్యాన్ని కోరుకుంటున్నారని అన్నారు. సరైన సమయంలో పార్టీ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. దీంతో తాజా పరిణామాల నేపథ్యంలో అమేఠీ నుంచి రాబర్ట్ వాద్రా పోటీకి దిగే అవకాశం లేకపోలేదని స్థానికంగా చర్చించుకుంటున్నారు.
ఇక ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఐదో విడతలో భాగంగా మే 20న అమేఠీలో పోలింగ్ జరగనుంది. మే 3న నామినేషన్ దాఖలకు చివరి తేదీ. ఎన్నికలకు 27 రోజులే సమయం ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ తన అభ్యర్థిని ప్రకటించలేదు. దీంతో ఈ స్థానంపై ఉత్కంఠ నెలకొంది.
Also Read..
Kangana Ranaut | దేశంలో కాషాయ కెరటం ఉప్పొంగుతోంది.. ఇకపై ఆ అలలు కొనసాగుతాయ్ : కంగనా రనౌత్
Patanjali | మరోసారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి.. రెండు రోజుల్లో రెండోసారి
Tesla layoffs | ఈవీ దిగ్గజం కొలువుల కోత : 6 వేల మందిపై టెస్లా వేటు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

