ప్రొఫెసర్ చెయ్యి నరికిన ముగ్గురికి జీవిత ఖైదు
కేరళలో 2010లో సంచలనం సృష్టించిన ప్రొఫెసర్ చెయ్యి నరికిన ఘటనలో ముగ్గురు దోషులకు జీవితఖైదు విధిస్తూ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. ఈ ఘటనతో సంబంధం ఉన్న మరో ముగ్గురికి మూడేండ్ల జైలు శిక్షను విధించింది. ఈ ఘటనను ఉగ్రవాద చర్యగా అభివర్ణించిన కోర్టు, ఉపశమనం పొందేందుకు వారికి అర్హత లేదని పేర్కొంది.
కొచ్చి : కేరళలో 2010లో సంచలనం సృష్టించిన ప్రొఫెసర్ చెయ్యి నరికిన ఘటనలో ముగ్గురు దోషులకు జీవితఖైదు విధిస్తూ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. ఈ ఘటనతో సంబంధం ఉన్న మరో ముగ్గురికి మూడేండ్ల జైలు శిక్షను విధించింది. ఈ ఘటనను ఉగ్రవాద చర్యగా అభివర్ణించిన కోర్టు, ఉపశమనం పొందేందుకు వారికి అర్హత లేదని పేర్కొంది. ప్రత్యేక కోర్టు జడ్జి అనిల్ కే భాస్కర్ కేసును విచారించారు. నిషేధిత సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)కి చెందిన సాజిల్, నాసర్, నజీబ్లను ప్రధాన దోషులుగా పేర్కొంటూ జీవిత
ఖైదును విధించారు. దోషులకు సహకరించిన నౌషద్, పీపీ మొయిద్దీన్ కున్హు, అయూబ్లకు మూడే ండ్ల జైలు శిక్షను విధించింది. రూ.4 లక్షలను జరిమానాగా విధించిన కోర్టు, ఆ మొత్తాన్ని బాధితుడు జోసెఫ్కు అందించాలని సూచించింది.
అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం
ప్రొఫెసర్ టీజే జోసెఫ్ చేతిని 2010లో పీఎఫ్ఐకి చెందిన సభ్యులు దారుణంగా నరికేశారు. అప్పట్లో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రశ్నాపత్రం తయారీలో ప్రొఫెసర్ ఓ మతాన్ని కించపరిచారనే ఆరోపణలపై వారు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Kerala
- National news
- NIA Court
- PFI
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

