న్యూఢిల్లీ: ఢిల్లీలో ట్రాఫిక్ నిబంధనలు మరింత కఠినతరం చేశారు. ఎన్సీఆర్ పరిధిలో రోడ్డుపై రాంగ్ రూట్లో వెళ్తున్న వాహనదారులపై తొలిసారిగా ఢిల్లీ పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఈ విషయంలో ఢిల్లీ దేశంలోనే తొలి యూటీగా నిలిచింది. ఇప్పటివరకు కనీసం మూడు ఎఫ్ఐఆర్లను నమోదు చేశామని, ఇది బెయిల్ లభించే నేరమని, అరెస్ట్ అయిన తర్వాత వాహనదారులు బెయిల్పై విడుదలైనట్టు పోలీసులు తెలిపారు.
ఢిల్లీ కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్లో అమన్ అనే వ్యక్తిపై తొలి కేసు నమోదైందన్నారు. భారత న్యాయ సంహిత ప్రకారం ఉల్లంఘనులకు ఆరు నెలల జైలు లేదా వెయ్యి రూపాయల జరిమానా లేదా రెండూ విధించవచ్చు. ఇప్పటివరకు ఇలాంటి ఉల్లంఘనలకు మొదటి సారైతే రూ. 5 వేలు, రెండోసారి రూ.10 వేలు జరిమానాగా విధించే వారమని ఓ అధికారి చెప్పారు.