ఆర్టీపీసీఆర్ టెస్ట్‌లో నెగెటివ్ ఉంటేనే రాష్ట్రంలోకి అనుమతి..
ఆర్టీపీసీఆర్ టెస్ట్| దేశంలో కరోనా కేసులు నానాటికి పెరుగుతుండటంతో రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులకు పశ్చిమబెంగాల్ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది.

కోల్‌కతా: దేశంలో కరోనా కేసులు నానాటికి పెరుగుతుండటంతో రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులకు పశ్చిమబెంగాల్ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది. రైళ్ల ద్వారా రాష్ట్రంలోకి వస్తున్న ప్రయాణికులు 72 గంటల ముందే ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించుకోవాలని, అందులో నెగెటివ్ అని తేలితేనే అనుమతిస్తామని ఆదేశాలు జారీచేసింది. కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని ప్రకటించింది. కరోనా కట్టడికి పశ్చిమబెంగాల్ తోపాటు పలు రాష్ట్రాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. రైళ్లలో ఎక్కే ప్రయాణికులకు థర్మల్ స్కానింగ్ చేయాలని, ఆర్టీపీసీఆర్ నెగిటివ్ నివేదిక ఉన్న వారినే రైళ్లలోకి అనుమతించాలని శాఖ కార్యదర్శి హెచ్ కే దివేది రైల్వే ఉన్నతాధికారులకు రాసిన లేఖలో కోరారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,21,872 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
కరోనాపై నేను, అనుష్క ఉద్యమం ప్రారంభిస్తున్నాం: విరాట్ కోహ్లీ
పీఎఫ్ విత్ డ్రా బ్యాంకు అకౌంట్ అప్డేట్ చేసుకోవచ్చిలా…!
నేడు కాంగ్రెస్ ఎంపీలతో సోనియాగాంధీ భేటీ
పావురం కాలికి ఎలక్ట్రానిక్ పరికరం.. గూఢచర్యమని అనుమానం..!
మరో హీరోయిన్‌కు కరోనా పాజిటివ్
రాజస్థాన్‌లో 14 రోజుల లాక్డౌన్
అమెరికాలో ఆరో తరగతి బాలిక కాల్పులు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

