కరోనాపై అనుష్క, నేను ఉద్యమం ప్రారంభిస్తున్నాం: విరాట్ కోహ్లి
విరాట్ కోహ్లీ | విరాట్, అనుష్క శర్మ దంపతులు ఇప్పటికే కరోనా బాధితుల సహాయార్థం రూ. 2 కోట్లు విరాళం ఇస్తున్నట్టు ప్రకటించగా, ఇప్పుడు ఫండ్ రైజింగ్

కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా విజృంభిస్తుండడంతో చాలా మంది పరిస్థితి దయనీయంగా మారింది. ఇలాంటి పరిస్థితులలో వారికి అండగా నిలబడేందుకు సెలబ్రిటీలు ముందుకు వస్తున్నారు. విరాట్, అనుష్క శర్మ దంపతులు ఇప్పటికే కరోనా బాధితుల సహాయార్థం రూ. 2 కోట్లు విరాళం ఇస్తున్నట్టు ప్రకటించగా, ఇప్పుడు ఫండ్ రైజింగ్ కోసం క్యాంపెయిన్ మొదలు పెట్టారు. తాజాగా అనుష్క, విరాట్ కోహ్లిలు తమ ట్విట్టర్ లో వీడియో షేర్ చేస్తూ.. కరోనా రెండో దశ విజృంభణపై దేశం పోరాటం చేస్తుంది. ఈ సమయంలో మా వంతుగా విరాళాలు సేకరించాలని అనుకుంటున్నాం అని స్పష్టం చేశారు.
ప్రస్తుతం దేశంలో పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉన్నాయి. కరోనాపై దేశం పోరాటం చేస్తుండగా, ఈ పరిస్థితులలో ప్రజల పోరాటం చాలా కష్టంగా ఉంది. మన కోసం వైద్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఎంతగానో కష్టపడుతున్నారు. వారికి ఇప్పుడు మనం అండగా ఉండాలి. అందుకే అనుష్క శర్మ , నేను .. కెట్టోతో కలిసి ఫండ్ రైజింగ్ క్యాంపెయిన్‌ను మొదలు పెడుతున్నాం. మీరిచ్చే ప్రతి రూపాయి ఎంతో ఉపయోగపడుతుంది. మన కుటుంబం కోసం, స్నేహితుల కోసం కలిసి కట్టుగా పని చేద్దాం. కరోనాను జయిద్దాం. స్టే సేఫ్, స్టే హోమ్ అంటూ వీడియో సందేశంలో తెలిపారు విరాట్ దంపతులు. కాగా, కొద్ది రోజుల వరకు ఐపీఎల్ 2021తో బిజీగా ఉన్న విరాట్ కోహ్లీ, ఈ సిరీస్ అర్ధాంతరంగా ఆగిపోవడంతో ఇంటికి చేరుకొని కరోనా బాధితుల కోసం సహాయ కార్యక్రమాలు మొదలు పెట్టారు.
Anushka and I have started a campaign on @ketto, to raise funds for Covid-19 relief, and we would be grateful for your support.
— Virat Kohli (@imVkohli) May 7, 2021
Let’s all come together and help those around us in need of our support.
I urge you all to join our movement.
Link in Bio! 🙏#InThisTogether pic.twitter.com/RjpbOP2i4G
ఇవి కూడా చదవండి..
రాష్ట్రానికి మరో మూడు రోజులు వర్ష సూచన
చైనా రాకెట్‌పై అమెరికా సైన్యానికి ప్రణాళిక లేదు : లాయిడ్ ఆస్టిన్
రాజస్థాన్‌లో 14 రోజుల లాక్డౌన్
టీ తోట కార్మికులపై కరోనా పంజా.. 133 మంది పాజిటివ్
ముంబైలో ఎయిర్ అంబులెన్స్ అత్యవసర ల్యాండింగ్.. తప్పిన ప్రమాదం
ఛత్తీస్‌గఢ్ జైలు నుంచి ఐదుగురు ఖైదీల పరారీ
తమిళనాడు సీఎంగా ప్రమాణం చేసిన స్టాలిన్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | రాహుల్ గాంధీ అమెరికన్ ఎత్తుగడలు.. సీజేపీపై ఆయన వ్యూహం ఎందుకు ఫలించడం లేదు!
Vegetable Nutrition | కూరగాయలు తింటున్నా పోషకాలు అందడం లేదా? ఈ వంటింటి చిట్కాలు తెలుసుకోండి!
Section 22A | సెక్షన్ 22ఏ జాబితా నుంచి తొలగించినా.. ఆస్తులు కొనేందుకు వెనుకడుగు వేస్తున్న ప్రజలు!
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్ విధ్వంసం.. షఫాలీ సునామీ.. జింబాబ్వే సిరీస్ క్లీన్‌స్వీప్
Civil Supplies | సివిల్ సైప్లెలో అవినీతి రాజ్యం.. మిల్లర్లతో మిలాఖత్, గన్నీ బ్యాగుల టెండర్లలో కమీషన్ల దందా!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

