అమెరికాలో ఆరో తరగతి బాలిక కాల్పులు
అమెరికా | అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. ఇదాహో రాష్ర్టంలోని రిగ్బి మిడిల్ స్కూల్లో గురువారం ఓ విద్యార్థిని కాల్పులకు పాల్పడింది.

లాస్ ఏంజెల్స్ : అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. ఇదాహో రాష్ర్టంలోని రిగ్బి మిడిల్ స్కూల్లో గురువారం ఓ విద్యార్థిని కాల్పులకు పాల్పడింది. ఆరో తరగతి చదువుతున్న బాలిక తన వెంట తెచ్చుకున్న తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఇద్దరు విద్యార్థులు, మరొకరు స్కూల్ సిబ్బంది గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. కాల్పులకు పాల్పడిన బాలికను అదుపులోకి తీసుకున్నారు. గతేడాది అమెరికాలో తుపాకీ కాల్పులకు సంబంధించిన ఘటనల్లో 43 వేల మందికి పైగా మరణించారు. ఈ మరణాల్లో కొందరు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడిన వారు ఉన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

