పీఎఫ్ విత్ డ్రా బ్యాంకు అకౌంట్ అప్డేట్ చేసుకోవచ్చిలా…!

ఢిల్లీ ,మే 7: ఎంప్లాయిస్ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) సబ్స్క్రైబర్లు ప్రావిడెంట్ ఫండ్ నుంచి ఉపసంహరించుకోవడానికి ఈపీఎఫ్ఓ కొన్ని నిబంధనలు రూపొందించింది. యూనివర్సల్ అకౌంట్ నెంబర్(యుఎన్ఏ) ప్రవేశ పెట్టిన తర్వాత సబ్స్క్రైబర్లు ఆన్లైన్లో పీఎఫ్ మొత్తాన్ని చాలా ఈజీగా ఉపసంహరించుకునే వెసులుబాటు కల్పించింది. యుఎన్ఏ12 అంకెలతో కూడిన ప్రత్యేక నెంబర్. సబ్స్క్రైబర్లు ఒక్కొక్కరికి ఒక్కో యుఎన్ఏ నెంబర్ ఉంటుంది. ఇది పర్మినెంట్‌గా ఉంటున్నందున ఉద్యోగాలు మారినప్పటికీ యుఎన్ఏమాత్రం ఒక్కటే ఉంటుంది.
యుఎన్ఏనెంబర్ ద్వారా ఈపీఎఫ్ పోర్టల్‌లోకి లాగిన్ కావడం ద్వారా పీఎఫ్ మొత్తాన్ని నిబంధనలకు అనుగుణంగా ఉపసంహరించుకోవచ్చు. అయితే క్లెయిమ్స్ ఆలస్యమవుతున్నాయని, తిరస్కరణకు గురవుతున్నాయని ఫిర్యాదులు వచ్చాయి. ఇందుకు కారణం సరైన బ్యాంక్ ఖాతా వివరాలు ఇవ్వక పోవడమేనని ఈపీఎఫ్ఓస్పష్టం చేసింది. బ్యాంక్ ఖాతా నెంబర్ ఐఎఫ్ఎస్సీ కోడ్ వివరాల్లో తప్పులుంటే మీ క్లెయిమ్స్ తిరస్కరించే అవకాశముంది. ఆన్ లైన్ ద్వారా ఈపీఎఫ్ఓ ఖాతాలో మీ బ్యాంకు వివరాలు అప్ డేట్ చేసుకోవడం సులభం. కానీ దీనికి కంపెనీ యాజమాన్యం ఆమోదం అవసరం.
బ్యాంకు ఖాతా అప్డేషన్ ఎలాగంటే…?
https://www.epfindia.gov.in/site_en/index.php – UAN ఐడీ, పాస్‌వర్డ్‌ను ఉపయోగించి లాగిన్ కావాలి.
-మేనేజ్ పైన క్లిక్ చేసి, కేవైసీ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
-డాక్యుమెంట్స్ పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత బ్యాంకు ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
- బ్యాంకు అకౌంట్ వివరాలు అప్ డేట్ చేయడానికి అకౌంట్ నెంబర్‌ను ఎంటర్ చేయాలి. అలాగే కోడ్ కూడా పేర్కొనాలి.
- ఆ తర్వాత Sసేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
-కేవైసీ ఆమోదం కోసం పెండింగ్‌లో ఉన్నట్లు చూపుతుంది. మీ సంస్థ ఆమోదం కోసం డాక్యుమెంట్ ఫ్రూఫ్స్ ని సమర్పించాలి. ఈ వివరాలను సంస్థ యజమాని వెరిఫై చేసి అప్రూవ్ చేస్తారు. ఆ తర్వాత మీకుకేవైసీ డిజిటల్ అప్రూవ్ అయినట్లుగా చూపిస్తుంది. టెస్ట్ మెసేజ్ రూపంలో మీ మొబైల్‌కు సందేశం వస్తుంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
- Tags
- employees
- EPFO
- technology
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

