NEET UG 2025 | వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు గత నెల దేశ వ్యాప్తంగా నిర్వహించిన నీట్-యూజీ పరీక్ష ప్రొవిజినల్ ఆన్సర్ కీ (NEET UG Provisional Answer Key) విడుదలైంది. ఈ ఆన్సర్ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency) మంగళవారం విడుదల చేసింది. నీట్ యూజీ 2025 పరీక్ష రాసిన విద్యార్థులు అధికారిక వెబ్సైట్ https://neet.nta.nic.in/ ద్వారా తమ ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్ ( response sheets), ప్రశ్నాపత్రాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
అలాగే.. ఈ ప్రొవిజినల్ ఆన్సర్ కీలోని ఏదైనా సమాధానంపై అభ్యంతరాలు ఉంటే తెలియజేయవచ్చని ఎన్టీఏ సూచించింది. ఇందుకోసం ఒక్కో ప్రశ్నకు రూ.200 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. నేటి నుంచి జూన్ 5వ తేదీ అర్ధరాత్రి 11:50 గంటలలోగా ఆన్లైన్లో అభ్యంతరాలను తెలియజేయవచ్చు. విద్యార్థులు లేవనెత్తిన అభ్యంతరాలను సబ్జెక్టు నిపుణుల ప్యానల్ సమీక్షించనుంది. ఈ నెలలో ఫైనల్ ఆన్సర్ కీతో పాటు ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. అనంతరం నీట్ యూజీ 2025 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలకానుంది. మే 4వ తేదీన దేశవ్యాప్తంగా జరిగిన నీట్ యూజీ పరీక్షకు 20.8 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. 5,400కు పైగా కేంద్రాల్లో పటిష్ఠ భద్రత మధ్య ఈ పరీక్షను నిర్వహించారు. విదేశాల్లోని 14 కేంద్రాల్లోనూ నీట్ యూజీ పరీక్ష జరిగింది.
Also Read..
Spying | ఉగ్రవాదులతో సంబంధాలు.. ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులను తొలగించిన జమ్ము కశ్మీర్ ప్రభుత్వం
Northeastern States | మిజోరాంలో వర్షబీభత్సం.. 552 చోట్ల విరిగిపడ్డ కొండచరియలు.. దెబ్బతిన్న 152 ఇళ్లు
COVID-19 | పశ్చిమబెంగాల్లో కొత్తగా 41 మందికి కరోనా పాజిటివ్