Food Poisoning | ఫుడ్ పాయిజన్ (Food Poisoning) కారణంగా వందల మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన మహారాష్ట్ర (Maharashtra)లోని పాల్ఘర్ (Palghar) జిల్లాలో చోటు చేసుకుంది. అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
జిల్లాలోని దహను తాలూకాలోగల 20 ఆశ్రమ పాఠశాలలకు (20 Ashram Schools) చెందిన దాదాపు 250 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కారణంగా అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులు సోమవారం రాత్రి కలాంగావ్లోని సెంట్రల్ కిచెన్ నుంచి తెచ్చిన భోజనం తిన్న కొద్ది సేపటికే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వికారం, వాంతులు వంటి ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడ్డారు. దీంతో అధికారులు విద్యార్థులను వెంటనే సమీపంలోని ఆరోగ్య కేంద్రాలకు తరలించారు. వారంతా ప్రస్తుతం ఆరోగ్య కేంద్రాల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో కొందరు డిశ్చార్జ్ అయ్యారు.
ఇంకా 150 మంది విద్యార్థులు కాసా, తలసరి, వంగావ్, పాల్ఘర్, మానేర్‌లోని గ్రామీణ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు జిల్లా కలెక్టర్ గోవింద్ బోడ్కే తెలిపారు. వారి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఘటనపై విచారణకు ఆదేశించినట్లు కలెక్టర్ తెలిపారు. ఫుడ్ శాంపిల్స్‌ను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపినట్లు పేర్కొన్నారు.
Also Read..
Prabhas | వయనాడ్ విషాదం.. భారీ విరాళం ప్రకటించిన ప్రభాస్
Zika virus | పూణెలో జికా వైరస్ కలకలం.. 66 కేసులు నమోదు
Sheikh Hasina | బంగ్లాదేశ్‌లో హింసాకాండ.. హసీనా పార్టీకి చెందిన 29 మంది డెడ్‌బాడీస్ లభ్యం