పాట్నా: బీహార్‌లో ఆర్జేడీకి (RJD) కోలుకోలేని విధంగా ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలోని మొత్తం 40 స్థానాల్లో అత్యధిక స్థానాల్లో ఎన్డీఏ కూటమి దూసుకుపోతున్నది. సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ 13 సీట్లలో లీడ్‌లో ఉండగా, బీజేపీ 11 చోట్ల, లోక్‌జనశక్తి 5 చోట్ల తిరుగులేని ఆధిక్యంలో దూసుకుపోతున్నాయి. ఇక ఇండియా కూటమిలోని ఆర్జేడీ 4, సీపీఐఎంఎల్ 2, సీపీఐ, కాంగ్రెస్, హెఏఎంఎస్ ఒక్కో చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ఇతరులు 2 సీట్లలో లీడ్‌లో ఉన్నారు.
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ కుమార్తె మీసా భారతి పాటలీపుత్రలో బీజేపీపై 6,665 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక సరన్‌లో పోటీచేస్తున్న లాలూ చిన్న కుమార్తె రోహిణి ఆచార్యపై బీజేపీ అభ్యర్థి 998 ఓట్ల మెజార్టీతో ఉన్నారు.